బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తో బోయపాటి సినిమా..?

Published : Sep 17, 2018, 03:25 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తో బోయపాటి సినిమా..?

సారాంశం

బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ తో స్టార్ డైరెక్టర్ బోయపాటి సినిమా చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రాని క్రేజ్ కౌశల్ కి వచ్చింది

బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ తో స్టార్ డైరెక్టర్ బోయపాటి సినిమా చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి రాని క్రేజ్ కౌశల్ కి వచ్చింది. అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ లో క్రేజ్ తెచ్చుకున్న వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు మేకర్స్.

తాజాగా కౌశల్ కి బోయపాటి సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. జగపతిబాబుని విలన్ గా పరిచయం చేసిన బోయపాటి ఇప్పుడు కౌశల్ ని విలన్ గా పరిచయం చేయబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించి బోయపాటి.. కౌశల్ తో చర్చించకపోయినా... బోయపాటి టీమ్ మాత్రం కౌశల్ భార్యని సంప్రదించినట్లు తెలుస్తోంది.

దానికి ఆమె సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో కౌశల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించారు. కానీ హీరో స్నేహితుల పాత్రలకే పరిమితమయ్యారు. ఆయనకి సినిమాల్లో ఆశించిన గుర్తింపు లభించకపోవడంతో సీరియళ్లతో బిజీగా మారారు.

బోయపాటి నిజంగానే కౌశల్ కి తన సినిమాలో అవకాశం ఇస్తే.. ఇక కెరీర్ పరంగా అతడు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్నీ కుదిరితే బాలయ్య సినిమాలో కౌశల్ విలన్ గా కనిపించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?
Vishwanath and Sons 2 Days Collections: సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్‌