సూపర్ స్టయిలీష్‌ లుక్‌లో రచ్చ చేస్తున్న నిఖిల్‌

Published : Sep 05, 2020, 09:14 PM ISTUpdated : Sep 05, 2020, 09:16 PM IST
సూపర్ స్టయిలీష్‌ లుక్‌లో రచ్చ చేస్తున్న నిఖిల్‌

సారాంశం

నిఖిల్‌ సిక్స్ ప్యాక్‌ బాడీ లుక్‌లో ఓ ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. సూపర్‌డ్రై అనే స్టయిలీస్ట్ సంస్థ తయారు నిఖిల్‌ని స్టయిలీస్‌గా తయారు చేసింది. సూపర్‌డ్రై బాడీతో ఔట్‌ఫిట్‌గా కనిపిస్తూ నిఖిల్‌ ఆకట్టుకుంటున్నాడు.

యంగ్‌ హీరో నిఖిల్‌ ఇటీవల లాక్‌ డౌన్‌ టైమ్‌లో పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటరయ్యాడు. తన ప్రియురాలు, డాక్టర్‌ పల్లవి వర్మని పెళ్ళి చేసుకున్న తర్వాత ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఆ జోష్‌ని మరో రూపంలో చాటుకున్నాడు నిఖిల్‌. 

తాజాగా ఆయన సిక్స్ ప్యాక్‌ తరహా బాడీ లుక్‌లో ఓ ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. సూపర్‌డ్రై అనే స్టయిలీస్ట్ సంస్థ తయారు నిఖిల్‌ని స్టయిలీస్‌గా తయారు చేసింది. సూపర్‌డ్రై బాడీతో ఔట్‌ఫిట్‌గా కనిపిస్తూ నిఖిల్‌ ఆకట్టుకుంటున్నాడు. డిఫరెంట్‌ ఎయిర్‌ స్టయిల్‌, స్టయిలీష్‌ డ్రెస్‌తో అలరిస్తున్నాడు. ఈ లుక్ వెనకాల చాలా మందే శ్రమించారట. స్టయిలీస్ట్ రష్మిత తాప, షాట్‌ తీసింది అడ్రిన్‌ సెక్వెరా, హెయిర్‌ స్టయిలిస్ట్ డీపర్‌సేలూన్‌, మేకప్‌ రాధికాదేవ్‌ పనిచేశారు. 

తాజాగా ఈ ఫోటోని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఇది విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గతేడాది `అర్జున్‌ సూరవరం`తో మంచి విజయాన్ని అందుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నిఖిల్‌ ప్రస్తుతం `కార్తికేయ 2`, `18పేజెస్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..