తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తన భార్య బేబీ బంప్ చూపిస్తూ, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

Published : Feb 14, 2023, 04:53 PM IST
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తన భార్య బేబీ బంప్ చూపిస్తూ, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

సారాంశం

ట్యాలెంట్ ఉన్న నటుడు నవీన్ చంద్ర అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలో నవీన్ నటనకి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నవీన్ చంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు.   

ట్యాలెంట్ ఉన్న నటుడు నవీన్ చంద్ర అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలో నవీన్ నటనకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు.  ప్రస్తుతం నవీన్ చంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. 

వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. నవీన్ చంద్ర తన వ్యక్తిగత జీవితాన్ని చాలా లో ఫ్రొఫైల్ లో మైంటైన్ చేస్తాడు. అందుకే నవీన్ చంద్ర ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా బయటకి రావు. నేను వాలంటైన్స్ డే సందర్భంగా నవీన్ చంద్ర గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. తాను తన భార్య ఓర్మ తల్లిదండ్రులు కాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. 

ఈ సందర్భంగా నవీన్ చంద్ర షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన భార్యతో అందంగా రొమాంటిక్ గా దిగిన ఫోటోలని పంచుకున్నాడు. నవీన్ భార్య ఓర్మ నిండు గర్భంతో బేబీ బంప్ చూపిస్తోంది. 

'బేబీ మూన్' ని మా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూడలేకున్నాం. తల్లి దండ్రులుగా మారేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. న్యూ ఫేజ్, న్యూ లైఫ్, న్యూ జర్నీ అంటూ నవీన్ చంద్ర పోస్ట్ చేశాడు. నవీన్ చంద్ర చివరగా రంగ రంగ వైభవంగా, విరాటపర్వం వీర సింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటించాడు. అరవింద సమేత చిత్రంలో నవీన్ పోషించిన పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో తాను తండ్రి కాబోతుండడంతో నవీన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది