Nani: పోస్టర్ పై వేసుకుంటే పాన్ ఇండియా మూవీ ఐపోదు... నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Jun 07, 2022, 02:05 PM ISTUpdated : Jun 07, 2022, 02:18 PM IST
Nani: పోస్టర్ పై వేసుకుంటే పాన్ ఇండియా మూవీ ఐపోదు... నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

సారాంశం

పాన్ ఇండియా ఫీవర్ హీరోలను ఊపేస్తున్న క్రమంలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పోస్టర్ పై రాసుకున్నంత మాత్రాన పాన్ ఇండియా చిత్రం అయిపోదంటూ సూటిగా మాట్లాడారు. 

టాలీవుడ్ ని పాన్ ఇండియా మేనియా వెంటాడుతుంది. చివరకు టూ టైర్ హీరోలు నిఖిల్, రామ్ పోతినేని కూడా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక అడివి శేష్ మేజర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై చెప్పుకోదగ్గ ఆదరణ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా కాన్సెప్ట్ పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏషియా నెట్ ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా నాని (Nani) స్పందించారు. 

ఏషియా నెట్ ప్రతినిధి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీపై పాన్ ఇండియా ఒత్తిడి ఉందా? అని అడుగగా.. మనకు మనం పాన్ ఇండియా అని చెప్పుకుంటే అది పాన్ ఇండియా చిత్రం కాదు. నా సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నానంటే అది పెద్ద బూతు. అది పాన్ ఇండియా చిత్రమా కాదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. పోస్టర్ పై పాన్ ఇండియా అని రాసుకున్నంత మాత్రాన పాన్ ఇండియా చిత్రం అయిపోదు, అన్నారు. పాన్ ఇండియా చిత్రాలకు యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ ఉండాలి అంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటని ఏషియా నెట్ ప్రతినిధి మరో ప్రశ్నగా అడిగారు.
 
దానికి నాని అవసరం లేదన్నారు. పుష్ప (Pushpa) చిత్ర కథ సౌత్ ఇండియా అడవులలో జరిగే మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది.  నార్త్ ఇండియాకు, బాలీవుడ్ కి ఆ కథతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అయ్యింది. కారణం ఏంటంటే బలమైన కంటెంట్. సినిమాకు కంటెంట్ ముఖ్యం, యూనివర్సల్ అప్పీల్ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం, అని నాని తెలిపారు. 

ఇక నాని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరక్కించిన అంటే సుందరానికి (Ante Sundaraniki) జూన్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో నాని మీడియాతో ముచ్చటించారు. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న అంటే సుందరానికి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్, టీజర్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌