ప్రసవించిన హీరో మనోజ్ వైఫ్ మౌనిక... ఇంతకీ అమ్మాయా? అబ్బాయా?

By Sambi ReddyFirst Published Apr 13, 2024, 1:19 PM IST
Highlights


హీరో మంచు మనోజ్ వైఫ్ మౌనిక ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మి తెలియజేసింది. 
 

మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ గత ఏడాది రెండో వివాహం చేసుకున్నారు. అక్క మంచు లక్ష్మి నివాసంలో మూడు రోజుల పాటు మనోజ్  వివాహం ఘనంగా జరిగింది. కొన్నాళ్లుగా భూమా మౌనికతో ఆయన రిలేషన్ లో ఉన్నారు. 2023 మార్చి 3న వీరి వివాహం జరిగింది. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. అయితే పెళ్ళికి చివరి నిమిషంలో హాజరైన మోహన్ బాబు దంపతులు మనోజ్-మౌనికలను ఆశీర్వదించారు. విష్ణు మాత్రం పెళ్ళికి రాలేదు. 

పెళ్ళై ఏడాది గడుస్తుండగా... మొదటి బిడ్డను ఆహ్వానించారు. మనోజ్ ఇటీవల మౌనిక గర్భం దాల్చిన విషయం వెల్లడించారు. ఏప్రిల్ 13 శనివారం మౌనిక ప్రసవించారు. మౌనిక పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మనోజ్ ఫ్యామిలీలోకి నాలుగో మెంబర్ వచ్చింది. ఆ దేవుడి దయతో అమ్మాయి పుట్టింది. మేము ముద్దుగా ఎం ఎం పులి అని పిలుచుకుంటాము. ధైరవ్ నేడు అన్నయ్య అయ్యాడు. ఈ కుటుంబం మీద ఆ శివుడి దయ ఎప్పుడూ ఉండాలి... అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. 

మనోజ్-మౌనికలు రెండో వివాహం చేసుకున్నారు. మౌనికకు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అయ్యింది. వీరికి ధైరవ్ పేరుతో కుమారుడు ఉన్నాడు. విడాకులు అనంతరం ధైరవ్ అమ్మ వద్దే పెరుగుతున్నాడు. ఇక మంచు మనోజ్ కి కూడా గతంలో ఓ అమ్మాయితో వివాహం జరిగింది. ఆమెతో విడాకులు తీసుకుని విడిపోయారు. 

భూమా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీకి చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో మొదటి వివాహాలు జరగక ముందే మౌనిక-మనోజ్ మిత్రులు. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఓ ఏడాదిన్నర పాటు చెన్నైలో మౌనిక-మనోజ్ ఉన్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మనోజ్ చెప్పాడు. 

⭐️ ANNOUNCEMENT 📣

🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu)
click me!