
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయాన్ని నిజం చేశాడు కిరణ్ అబ్బవరం. హీరోయిన్ రహస్యని మ్యారేజ్ చేసుకునేందుకు రెడి అయ్యాడు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోబోతున్నారట. తమ ప్రేమ విషయాన్ని బట్టబయలు చేశారు.
కిరణ్ అబ్బవరం `రాజావారు రాణిగారు` చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మెప్పించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` సినిమాతో హిట్ అందుకుని టాలీవుడ్‌లో హీరోల జాబితాలో చేరాడు. అలాగే వరుసగా అవకాశాలను అందుకుని అనతి కాలంలోనే బిజీ హీరో అయ్యారు. ఇప్పటికే ఆరేడు సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు విభిన్న సినిమాలతో రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పెళ్లి పీఠలెక్కబోతుండటం విశేషం. `రాజావారు రాణిగారు`లో హీరోయిన్ రహస్యతో కలిసి నటించాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే తన లవ్ స్టోరీని చాలా రహస్యంగా మెయింటేన్ చేశాడు కిరణ్. ఐదేళ్లుగా ఈ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఆ విషయం ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ మధ్య ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఎదురు కాగా ఆచితూచి వ్యవహరించాడు. కానీ దొరికిపోయాడు.
ఇప్పుడు ఏకంగా ప్రేమ విషయాన్ని ఓపెన్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్టు పీఆర్ ద్వారా తెలిపారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగబోతుందట. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం "దిల్ రూబా" సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. చివరగా ఆయన `రూల్స్ రంజాన్` చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.