నానికి విలన్ గా 'RX100' హీరో!

Published : Feb 06, 2019, 03:18 PM IST
నానికి విలన్ గా 'RX100' హీరో!

సారాంశం

విజయం అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత అతడి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

విజయం అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత అతడి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే అతడి లిస్టులో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ హీరో ఇప్పుడు విలన్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ సినిమా రూపొందించనున్నాడు. ఇందులో నాని ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.

కథ ప్రకారం సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, మేఘాఆకాష్, ప్రియా ప్రకాష్ వారియర్ లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. మరో ఇద్దరిని వెతికే పనిలో పడ్డారు. అలానే విలన్ పాత్ర కోసం కార్తికేయను అనుకున్నప్పడు అతడు ఒప్పుకుంటాడా..? లేదా..? అనే సందేహంతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ విన్న కార్తికేయ విలన్ రోల్ లో నటించడానికి చాలా ఎగ్జైట్ అయ్యాడట. దీంతో అతడినే విలన్ గా ఫైనల్ చేసుకున్నారు. సినిమా ట్రైలర్బయటకి వచ్చే వరకు కూడా కార్తికేయ పాత్రను సర్ప్రైజింగ్ గానే ఉంచాలని భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే