హే ఆపవయ్యా మీ నాన్న సుత్తి... బాలయ్యపై చిరంజీవి ఇండైరెక్ట్ కౌంటర్లు!

By Sambi ReddyFirst Published Jan 11, 2023, 5:03 PM IST
Highlights

 సందర్భం దొరకడంతో మెల్లగా బాలయ్యకు చురకలు వేశాడు చిరు. మా నాన్నగారూ అది మా నాన్నగారు ఇది అంటూ పదే పదే అంటే జనాలు సుత్తిలా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు.

చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అలాగే చిరంజీవి ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ పరోక్షంగా బాలయ్య గురించి చెప్పినట్లు ఉన్నాయి. రామ్ చరణ్ ప్రతిసారి, ప్రతి చోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. మా నాన్న చిరంజీవి, ఆయన చాలా గొప్పోడు అంటూ ప్రతిసారి చెబుతుంటే... జనాలకు విసుగొచ్చేస్తుంది. హే ఆపవయ్యా నీ సుత్తి అని చరణ్ ని తిడతారని చిరంజీవి కామెంట్ చేశారు. 

చిరంజీవి అక్కడ ఉదహరించిన తీరు చూస్తే బాలయ్యని ఉద్దేశించే అన్నట్లు ఉంది. '' ఆ రోజుల్లో మా నాన్నగారూ..'' అనేది బాలయ్య ఊతపదం. అలా ఎవరైనా అంటే వెంటనే బాలయ్య గుర్తొస్తారు. ఇక బాలయ్య ప్రతి వేదికపై నాన్న ప్రస్తావన తెస్తారు. మాకంటే ఎవరూ గొప్ప కాదంటారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ చిరంజీవి లేటెస్ట్ కామెంట్స్ చేశారనిపిస్తుంది. 

వాల్తేరు వీరయ్య ప్రీరీలీజ్ ఈవెంట్లో సైతం చిరంజీవి బాలయ్యను టార్గెట్ చేశారు. శృతి హాసన్ ఈవెంట్ కి అనారోగ్య కారణాలు చూపుతూ హాజరు కాలేదు. ఆమె ప్రస్తావన తెస్తూ.... ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు. సడన్ గా శృతి ఆరోగ్యం బాగోలేదంట. బహుశా ఆమెను ఎవరైనా బెదిరించారేమో... అని నవ్వుతూ సెటైర్స్ వేశారు. అసలు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాకుండా శృతి హాసన్ ని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. వీరసింహారెడ్డి చిత్రానికి పోటీగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాకుండా  శృతిని బాలయ్య బెదిరించాడన్నట్లు ఆయన ఆరోపణ ఉంది. 

అసలుకే 2023 సంక్రాంతి మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి కుటుంబం అన్నట్లు మారిపోయింది. తీవ్ర పోటీ మధ్య సంక్రాంతి విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి కొనసాగుతుంది. ఇక సంక్రాంతి సీజన్ కి ఉన్న మరో ప్రత్యేకత  హిట్ టాక్ తెచ్చుకుంటే రెండు మూడు సినిమాలు కూడా ఆడతాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల నిర్మాతలు ఒక్కరే కాగా.. రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. 
 

పరోక్షంగా బాలకృష్ణకి చురకలు అంటించిన చిరంజీవి 😃🫢 pic.twitter.com/kyFMfB7JID

— Vizag - The City Of Destiny (@Justice_4Vizag)
click me!