భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. కథ కూడా ఇదే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం డై హార్డ్ ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 30 ఏళ్ళు దగ్గరపడుతున్నా... మోక్షజ్ఞ హీరో కాలేదు. ఎన్టీఆర్ అయితే ఈ ఏజ్ కి మూడు నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టేశాడు. మోక్షజ్ఞను హీరో చేయాలని బాలయ్యపై తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రతిసారి వచ్చే ఏడాది మావాడు రంగంలోకి దిగుతున్నాడని బాలయ్య చెబుతున్నాడు. అయితే ఆయన మాటలు చేతల్లో కనబడటం లేదు.
మరోసారి బాలయ్య మోక్షజ్ఞ అరంగేట్రం మీద ఓపెన్ అయ్యారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలకృష్ణను హీరోయిన్ శ్రీలీల ''మోక్షజ్ఞ ఏంటి ఎప్పుడు?'' అని అడిగింది. సమాధానంగా బాలకృష్ణ... వచ్చే ఏడాదే మోక్షజ్ఞ చిత్రం ఉంటుంది. తన కెరీర్ గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను రాసిన ఆదిత్య 999 మ్యాక్స్ కథ ఉంది. ఈ కథను నేను ఒక రాత్రిలో రాసేశాను. అలాగే ఇంకో కథ కూడా ఉంది. మరికొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఈ సబ్జెక్టుతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తెరకెక్కుతుంది అనేది చెప్పలేను. కానీ వచ్చే ఏడాది హీరోగా వస్తాడని క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణ కామెంట్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. మరోవైపు భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ జోరు సరిపోదు. ప్రీ బిజినెస్ లెక్కల దృష్ట్యా భగవంత్ కేసరి రూ. 67 కోట్లకు పైగా షేర్ రాబట్టాలి. మూడు రోజులకు ఈ చిత్రం కేవలం 24 నుండి 25 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ఈ ఆదివారం కీలకం. లేదంటే భగవంత్ కేసరి భారీ నష్టాలు మిగిల్చే సూచనలు కలవు...
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేయగా, కాజల్ హీరోయిన్ గా చేసింది. థమన్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కింది.