సైమా అవార్డ్స్: టాప్ లో రంగస్థలం, కేజీఎఫ్.. చిట్టిబాబుకు మహానటి పోటీ!

Published : Jul 22, 2019, 10:11 AM ISTUpdated : Jul 22, 2019, 10:34 AM IST
సైమా అవార్డ్స్: టాప్ లో రంగస్థలం, కేజీఎఫ్.. చిట్టిబాబుకు మహానటి పోటీ!

సారాంశం

ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు అవార్డులు అందించే సైమా వేడుక త్వరలో జరగబోతోంది. దీనితో ఏ చిత్రాలు అత్యధిక అవార్డులు దక్కించుకుంటాయనే ఆసక్తి నెలకొని ఉంది. గతంలో కంటే వైభవంగా ఈ సారి సైమా అవార్డ్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సైమా 8వ అవార్డుల వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఆగష్టు ఆగష్టు 15, 16న సైమా అవార్డ్స్ వేడుకని ఘనంగా నిర్వహించనున్నారు. ఫాంటలూన్స్ సంస్థ ఈ వేడుకని స్పాన్సర్ చేస్తోంది. ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఫాంటలూన్స్ సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశంలో హీరోయిన్ శ్రీయ శరన్. సుధీర్ బాబు, రుహాని శర్మ, నిధి అగర్వాల్, ఫాంటలూన్స్ మార్కెటింగ్ హెడ్ ర్యాన్ పాల్గొన్నారు. సౌత్ ఇండియా సినీ తరాల సమక్షంలో వైభవంగా సైమా అవార్డ్స్ జరగబోతున్నాయి. ఈ సారి సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల మధ్య మంచి పోటీ నెలకొని ఉంది. 

తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం టాప్ లో కొనసాగుతోంది. ఈ చిత్రానికి మహానటి గట్టి పోటీ ఇస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన 96 టాప్ లో ఉంది. కన్నడలో కేజీఎఫ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

తెలుగులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన చిత్రాలు : 

1. రంగస్థలం - 12 నామినేషన్స్ 

2. మహానటి - 9 నామినేషన్స్ 

3. గీతా గోవిందం - 8 నామినేషన్స్ 

4. అరవింద సమేత - 6 నామినేషన్స్ 

PREV
click me!

Recommended Stories

OTT Movies:థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్న శ్రీవిష్ణు.. క్రేజీ యాక్షన్ మూవీస్, సిరీస్ లతో ఈ వారం ఓటీటీలో పండగే
బాలకృష్ణ సినిమాపై రూమర్స్.. మహేష్ బాబు మీమ్ తో డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై , హీరోయిన్ విషయంలోనే రచ్చ