Virata Parvam: అఫీషియల్.. రానా కోసం రంగంలోకి రాంచరణ్, వెంకటేష్, సుకుమార్..

Published : Jun 14, 2022, 01:46 PM IST
Virata Parvam: అఫీషియల్.. రానా కోసం రంగంలోకి రాంచరణ్, వెంకటేష్, సుకుమార్..

సారాంశం

రానా, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం'.  వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా తొలి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న కథలపై ఆసక్తి చూపిస్తున్నాడు. నటుడిగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. రానా, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం'.  వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ జూన్ 15న హైదరాబాద్ లో జరగనుంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల్ని కూడా ప్రకటించారు. రానా కోసం మెగా పవర్ స్టార్ రాంచరణ్, బాబాయ్ వెంకటేష్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ అతిథులుగా హాజరు కాబోతున్నారు. 

ముగ్గురు క్రేజీ సెలెబ్రిటీలతో విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుల పండుగలా జరగనుంది. నేనే రాజు నేనే మంత్రి, ఘాజి చిత్రాల తర్వాత రానాకి సరైన సక్సెస్ లేదు. భీమ్లా నాయక్ చిత్రంతో హిట్ పడ్డప్పటికీ అది సోలో మూవీ కాదు. 

దీనితో విరాట పర్వంపై రానా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి ఇద్దరి రోల్స్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. ఇక రానా, సాయి పల్లవి, రాంచరణ్, వెంకటేష్, సుకుమార్ ఒకే వేదికపై కనిపించనుండడం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌