
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్. మొదట్నుంచి ఉల్టాపుల్టా అని చెబుతున్నట్టుగానే ఐదో వారంలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. పవర్ అస్త్రలను వెనక్కి తీసుకున్నారు. శివాజీది ఆల్‌రెడీ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్‌లు కూడా తమ పవర్ అస్త్రలను వెనక్కి ఇచ్చేశారు. అయితే అందరి పవర్ అస్త్రాలు వెనక్కి వెళ్లడంతో శివాజీ హ్యాపీగా ఫీలయ్యాడు. తన అస్త్రలను తీసుకుంటారా? ఇప్పుడు అందరివి పోయినందుకు ఆయన హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ విషయంలో శోభా శెట్టి హర్ట్ అయ్యింది. కొందరు సంతోషిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇక మంగళవారం ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్‌లు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్ బాస్. ఈ నెల రోజుల్లో హౌజ్‌లో ఒకరితో ఒకరికి బాండింగ్ ఏర్పడి ఉంటుందని, అలా తమ బెస్ట్ బడ్డీలను ఎంపిక చేసుకోవాలని, అందరు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌బాస్. వాళ్లు బడ్డీలుగా ఏర్పడిన దాన్ని బట్టి మున్ముందు ఆట ఉంటుందని, అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో హౌజ్ సభ్యులు ఐదు జంటలుగా ఏర్పడ్డారు. శివాజీ-ప్రశాంత్, అమర్-సందీప్, ప్రియాంక-శోభా శెట్టి, గౌతమ్-శుభ శ్రీ, యావర్-తేజ బడ్డీలుగా ఏర్పడ్డారు.
అనంతరం వీరికి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన వారు సూపర్ పవర్ కూడా పొందుతారు. అందులో భాగంగా `స్మైల్` టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ స్మైల్‌లో పళ్లు మిస్సింగ్ ఉంటాయి. వాటిని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకో గేమ్ పెట్టాడు బిగ్ బాస్. దీనికి యావర్, శోభా శెట్టి సంచాలకులుగా వ్యవహరిస్తారు. అయితే మొదట శివాజీ, ప్రశాంత్ పళ్లు ఫిల్ చేసి బెల్ కొడతారు. ఆ తర్వాత గౌతమ్-శుభ శ్రీ, ఆ తర్వాత సందీప్-అమర్‌లు బెల్ కొడతారు. శోభా శెట్టి, ప్రియాంకలు, చివరగా యావర్ తేజలు నిలుస్తారు.
కానీ అందరు సరిగ్గా టీత్‌లను అమర్చకపోవడంతో యావర్-శోభాశెట్టి నిర్ణయం తీసుకోలేకపోతారు. కానీ తక్కువ మిస్టేక్స్ ఆర్డర్ ప్రకారం గౌతమ్-శుభశ్రీ, సందీప్- అమర్, శివాజీ-ప్రశాంత్, శోభాశెట్టి-ప్రియాంక, చివరగా యావర్-తేజలుగా నిర్ణయించారు. కానీ దీనిపై అటు అమర్, ఇటు ప్రియాంక అభ్యంతరం తెలిపారు. ఇది హౌజ్‌లో పెద్దగా గందరగోళానికి దారి తీస్తుంది. హౌజ్‌మేట్స్ గొడవలకు దిగడంతో ఒక్కసారిగా హౌజ్ హీటెక్కిపోయింది. ఇందులో ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.