`లూసీఫర్‌` రీమేక్‌ నుంచి వినాయక్‌ ఔట్‌.. పవన్‌ దర్శకుడు ఇన్‌

By Aithagoni Raju  |  First Published Nov 16, 2020, 9:51 AM IST

మొదట `లూసీఫర్‌` రీమేక్‌ స్క్రిప్ట్ పై `సాహో` దర్శకుడు సుజిత్‌ పనిచేశారు. స్క్రిప్ట్ ని తెలుగుకి తగ్గట్టు మౌల్డ్ చేసేందుకు చాలా రోజులు కూర్చున్నాడు. కానీ సుజిత్‌ విషయంలో చిరు సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కొన్నాళ్లు బాబీ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. ఆయన విషయంలోనూ మెగాస్టార్‌ సాటిస్పై కాలేదు.


మెగాస్టార్‌ చిరంజీవికి ఈ టైమ్‌లో సక్సెస్ ముఖ్యం కాబట్టి.  అందుకే ఇప్పుడు రీమేక్‌ చిత్రాలపై మోజు పడుతున్నారు. కొన్నాళ్ళు ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన `లూసీఫర్‌` రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. తమిళంలో హిట్‌ అయిన `వేదాళం` రైట్స్ ని తీసుకున్నారు. `వేదాళం` రీమేక్‌కి మెహర్‌ రమేష్‌ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు `లూసీఫర్‌` రీమేక్‌ విషయంలోనే స్పష్టత రావడం లేదు. 

మొదట `లూసీఫర్‌` రీమేక్‌ స్క్రిప్ట్ పై `సాహో` దర్శకుడు సుజిత్‌ పనిచేశారు. స్క్రిప్ట్ ని తెలుగుకి తగ్గట్టు మౌల్డ్ చేసేందుకు చాలా రోజులు కూర్చున్నాడు. కానీ సుజిత్‌ విషయంలో చిరు సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కొన్నాళ్లు బాబీ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. ఆయన విషయంలోనూ మెగాస్టార్‌ సాటిస్పై కాలేదు. దీంతో తనకు కెరీర్‌లో మైలురాయిలాంటి `ఠాగూర్‌`, `ఖైదీ నెంబర్‌ 150` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని అందించిన వినాయక్‌ని రంగంలోకి దించారు. 

Latest Videos

ఈ రెండు సినిమాలు రీమేక్‌లే కావడం, రెండూ హిట్లుగా నిలవడంతో వినాయక్‌పై చిరంజీవికి నమ్మకం ఉంది. వినాయక్‌ సైతం దీనిపై చాలా రోజులు వర్క్ చేశారు. కానీ చిరు వినాయక్‌ చెప్పిన కథ కూడా నచ్చలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి వినాయక్‌ తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాలుగో దర్శకుడి వద్దకు ఈ స్క్రిప్ట్ వెళ్ళిందట. పవన్‌ కళ్యాణ్‌ దర్శకుడు దీనిపై వర్క్ చేస్తున్నారట. ఆయన ఎవరో కాదు `గబ్బర్‌సింగ్‌`లాంటి బ్లాక్‌ బస్టర్‌ని రూపొందించిన హరీష్‌ శంకర్‌. 

ప్రస్తుతం హరీష్‌.. పవన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది ప్రారంభం కావడానికి మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ లోపు చిరంజీవితో `లూసీఫర్‌` రీమేక్‌కి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. రీమేక్‌లు చేయడంలో హరీష్‌ దిట్ట. `గబ్బర్‌సింగ్‌`, `గద్దలకొండ గణేష్‌` వంటి రీమేక్‌లతో హిట్లు కొట్టారు. ఆ నమ్మకంతోనే `లూసీఫర్‌` రీమేక్‌ బాధ్యతలు హరీష్‌ చేతిలో పెట్టాడట చిరు. మరి హరీష్‌తోనే ఇది పట్టాలెక్కుతుందా? లేక మరో దర్శకుడి వద్దకు చేరుతుందా? అనేది చూడాలి. 

click me!