కేసీఆర్ ఫామ్ హౌస్.. హరీష్ శంకర్ ట్వీట్!

Published : Dec 11, 2018, 01:39 PM ISTUpdated : Dec 11, 2018, 01:41 PM IST
కేసీఆర్ ఫామ్ హౌస్.. హరీష్ శంకర్ ట్వీట్!

సారాంశం

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్ధమైన కేసీఆర్ పై రకరకాల కామెంట్స్ వినిపించాయి. గెలుపుపై అంత నమ్మకం ఏంటో అంటూ సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్ధమైన కేసీఆర్ పై రకరకాల కామెంట్స్ వినిపించాయి. గెలుపుపై అంత నమ్మకం ఏంటో అంటూ సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఎక్కువగా తన ఫామ్ హౌస్ లో గడుపుతుంటాడు. ఈ విషయంపై కూడా ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ.. ఓడిపోతే వెళ్లి ఫామ్ హౌస్ లోనే మొక్కలను పెంచుకోవాలంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గెలుపు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మంది కేసీఆర్, కేటీఆర్ లను శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ విషయాన్ని ఆధారంగా చేసుకొని హరీష్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'ఫామ్ హౌస్ లో ఉన్నారో.. ఫామ్ లో ఉన్నారో.. తేల్చి చెప్పిన జనం.. ఇది ప్రజాస్వామ్యం పవర్ అంటే' అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీకి, కవితకి అభినందనలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య
అభిమానులకు అక్కినేని కోడలు సూపర్ గుడ్‌న్యూస్.. పెళ్లైన ఇన్ని రోజులకు..!