Harish Shankar:హరీష్ శంకర్ కథతో వెబ్ సీరిస్,దిల్ రాజు నిర్మాత

Surya Prakash   | Asianet News
Published : Jan 27, 2022, 11:19 AM IST
Harish Shankar:హరీష్ శంకర్ కథతో వెబ్ సీరిస్,దిల్ రాజు నిర్మాత

సారాంశం

ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గ్యాప్ లో తను రాసిన స్క్రిప్టు రైటర్ గాను కనిపించేప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏటీఎమ్ అనే వెబ్ సీరిస్ కు కథ ఇస్తున్నారు.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గ్యాప్ లో తను రాసిన స్క్రిప్టు రైటర్ గాను కనిపించేప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏటీఎమ్ అనే వెబ్ సీరిస్ కు కథ ఇస్తున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ సీరిస్ కు చంద్రమోహన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ ట్వీట్ ద్వారా తెలియచేసారు.

ఇంతకు ముందు కూడా  హరీష్ శంకర్ కథతో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒకరు ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నారు. ఆ డెబ్యూ సినిమా కోసం హరీష్ శంకర్ స్వయంగా స్క్రిప్టు అందించారు. ఈ ప్రాజెక్ట్ కి "వేదాంతం రాఘవయ్య" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ కూడా ఖరారు చేశారు. దర్శక నిర్మాతలు. మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సత్య దేవ్ ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నారు.  

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భవదీయుడు భగత్ సింగ్" సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్తో సాగే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ అతి తొందరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా పని చేయనున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు