'హరిహర వీరమల్లు' పవర్ గ్లాన్స్ వచ్చేసింది.. మల్లయోధులని మట్టికరిపిస్తున్న పవన్, గూస్ బంప్స్

Published : Sep 02, 2022, 10:46 AM IST
'హరిహర వీరమల్లు' పవర్ గ్లాన్స్ వచ్చేసింది.. మల్లయోధులని మట్టికరిపిస్తున్న పవన్, గూస్ బంప్స్

సారాంశం

హరిహర వీరమల్లు చిత్రం నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న టీజర్ సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ అన్నింటిని పటాపంచలు చేస్తూ అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ అందించారు. 

హరిహర వీరమల్లు చిత్రం నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న టీజర్ సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది. పిడుగే దిగొచ్చింది భళ్ళు భళ్ళున అంటూ పవర్ ఫుల్ బిజియం వినిపిస్తుండగా పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. 

కండలు తిరిగిన మల్లయోధులతో జరిగే పోరాట సన్నివేశం అది. ఒక్కొక్క మల్లయోధుడిని వీరమల్లు ఎత్తి కుదేస్తూ.. మట్టి కరిపిస్తున్నాడు. వీరమల్లు శత్రువుల పాలిట కాలయముడిలా కనిపిస్తున్నాడు. కదనరంగంలో తొడగొడుతూ గర్జిస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్, టీజర్ లో చూపించిన మల్లయోధుల ఫైట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కీరవాణి అందించిన బిజియం నెక్స్ట్ లెవల్ లో ఉంది. మొత్తంగా పవన్ బర్త్ డే రోజున దర్శకుడు క్రిష్ ఫాన్స్ ని నిరాశపరచలేదు. హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ." ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌