#Hanuman:‘హనుమాన్’ రచ్చ 10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

By Surya Prakash  |  First Published Jan 22, 2024, 11:31 AM IST

 రిలీజైన నాటి నుంచి ఈ చిత్రం ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఈ చిత్రం ప్రంపచం వ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు దాటి నెక్ట్స్ మైలు రాయి 300 కోట్ల దిశగా దుసుకుపోతోంది.



సంక్రాంతి వెళ్లిపోయినా  రిలీజ్ అయ్యి 10 రోజులు అయ్యినా హనుమాన్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కు బ్రేక్ పడటం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నా, థియేటర్స్ కేటాయింపు విషయంలో అన్యాయం జరగటంతో హాట్ టాపిక్ గా మారింది. దాంతో నిర్మాతలునష్టపోతారా థియేటర్స్ తక్కువ కౌంట్ కాబట్టి ఇబ్బంది వస్తుందా అని ట్రేడ్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూసింది. అయితే రిలీజైన నాటి నుంచి ఈ చిత్రం ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఈ చిత్రం ప్రంపచం వ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు దాటి నెక్ట్స్ మైలు రాయి 300 కోట్ల దిశగా దుసుకుపోతోంది.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ సినిమా, దానికి సంబంధించిన విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. తొలుత హనుమాన్‌కు తక్కువ థియేటర్లు ఇచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సినిమా విడుదలై వారం గడుస్తున్న హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.

Latest Videos

హనుమాన్ 10  రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (INC GST)
👉నైజాం : 26.56Cr
👉సీడెడ్ : 7.37Cr
👉ఉత్తరాంధ్ర: 7.39Cr
👉ఈస్ట్ గోదావరి: 5.65Cr
👉వెస్ట్ గోదావరి: 4.01CR 
👉గుంటూరు: 3.53Cr
👉కృష్ణా : 3.31Cr
👉నెల్లూరు : 1.69Cr
ఆంధ్రా, తెలంగాణా టోటల్ :- 59.51CR(98.15CR~ Gross)
👉కర్ణాటక:- 9.40Cr
👉హిందీ +రెస్టాప్ ఇండియా: 17.20Cr
👉ఓవర్ సీస్ : 21.80Cr****
మొత్తం ప్రపంచం వ్యాప్తంగా  WW:- 107.91CR(201.35CR~ Gross)

అయితే అందుతున్న లెక్కలు ప్రకారం #Hanuman నైజాం ను ₹6.3 కోట్లు పెట్టి మైత్రీ వారు తీసుకున్నారు. ఇప్పుడు 5 రోజుల షేర్ ₹11 Cr (excluding GST). ఇదే స్పీడులో దూసుకువెళ్తే లాంగ్ రన్ లో నైజాం ఏరియాలో ₹20 Cr పైనే కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే మంచి లాభాల్లో సినిమా అందచేసినట్లు అన్నమాట. 
 
 తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.
 

click me!