'హనుమాన్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ బడ్జెట్ 100 కోట్లు.. క్రేజీ డీటెయిల్స్..

By tirumala ANFirst Published Apr 15, 2024, 5:19 PM IST
Highlights

తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన క్వాలిటీ అవుట్ పుట్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. 

పాన్ ఇండియా వైడ్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగుతోంది. హనుమాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ సృష్టించిన సంచలనం అలాంటిది మరి.  ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన హనుమాన్ పాన్ ఇండియా వైడ్ సంచలనాలు సృష్టించింది. ఇండియా మొత్తం ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన క్వాలిటీ అవుట్ పుట్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీ కోసం స్క్రిప్ట్, ఇతర పనులు పూర్తి చేసుకుంటున్నాడు. 

అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం 100 కోట్ల బడ్జెట్ లో ఉండబోతోందని తెలుస్తోంది. హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రశాంత్ వర్మ విజువల్స్ పరంగా గ్రాండ్ గా ఉండే వైవిధ్యమైన కథతో రాబోతున్నారట. మరో సూపర్ హీరో కథ ఏమైనా సిద్ధం చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. 

ఈ చిత్రం కోసం ప్రశాంత్ వర్మ టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు పరభాషా నటులతో కూడా టచ్ లో ఉన్నట్లు సమాచారం. చివరికి ఎవరు ఈ చిత్రంలో హీరో అవుతారు అనేది వేచి చూడాలి. హనుమాన్ చిత్రాన్ని మించేలా అంతకి మించి గ్రాండ్ గా ఉండేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకుంటున్నారు. 

click me!