`అంబాజీపేట మ్యారేజీ బ్యాండు` ట్రైలర్‌.. సుహాస్‌ మరోసారి దానిపై పోరాటం..

Published : Jan 24, 2024, 03:55 PM IST
`అంబాజీపేట మ్యారేజీ బ్యాండు` ట్రైలర్‌.. సుహాస్‌ మరోసారి దానిపై పోరాటం..

సారాంశం

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో సుహాస్‌ ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజీ బ్యాండు` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మరి ఎలా ఉందంటే..

యంగ్‌ హీరో సుహాస్‌.. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన `కలర్‌ ఫోటో` ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. ఆ మధ్య `రైటర్‌ పద్మభూషణ్‌`తో పెద్ద హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ కథతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు` చిత్రంలో నటించారు. దుశ్యంత్‌ కాటిక నేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుహాస్‌కి జోడీగా తెలుగు అమ్మాయి శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తుంది. 

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌. ఇది విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథగా అనిపిస్తుంది. ఇందులో సుహాస్‌ పెళ్లిళ్లకి బ్యాండు వాయించే వాడిగా కనిపించాడు. ఓ వైపు కటింగ్‌ షాప్‌, మరోవైపు బ్యాండు వాయిస్తుంటాడు. అంబాజీపేట అనే ఊర్లోనే పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. అంతేకాదు ఊరి గొడవల్లో తలదూరుస్తాడు. దీంతో వాళ్లు తిరగబడతారు. ప్రేమ కాస్త పోరాటం లా మారుతుంది. ఊర్లో కులాలు, వర్గాల మధ్య పోరాటంలా మారుతుంది. మరి చివరికి ఏం జరిగింది? ఎవరు విజయం సాధించారు, సుహాస్‌ ఏం చేశాడనేది కథగా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా `కలర్‌ ఫోటో` తరహాలో సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌, మహాయన మోషన్‌ పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతుంది. బన్నీ వాసు, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?