ఎక్స్ లవర్ తో రొమాంటిక్ సినిమా!

Published : Mar 05, 2019, 04:09 PM IST
ఎక్స్ లవర్ తో రొమాంటిక్ సినిమా!

సారాంశం

దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే వెండితెరపై అందాలతో సెగలు రేపిన వైట్ బ్యూటీ హన్సిక జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అమ్మడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో జాతఃకట్టడానికి రెడీ అయ్యింది. 

హన్సిక కొన్నేళ్ల వరకు కోలీవుడ్ కాంట్రవర్సీ హీరో శింబుతో ప్రేమాయణాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన అనంతరం మళ్ళి ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ఆ మధ్య కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ శింబు ఆమె నటిస్తే నటించను అని రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది.

ఇక ఫైనల్ గా ఒక యువ దర్శకుడు జమీల్ తెరకెక్కించబోయే లవ్ ఎంటర్టైనర్ లో అమ్మడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమా హన్సికకు 50వ చిత్రం కావడం విశేషం. గతంలో వీరి కలయికలో వచ్చిన వాలు - వెట్టై మన్నన్ సినిమాలలు మంచి టాక్ ను తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా రావడంతో ఎక్స్ కపుల్స్ తెరపై ఏ విధంగా కనిపిస్తారో చూడాలని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!