సీనియర్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న రానా తమ్ముడు ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 21, 2022, 12:01 PM IST
సీనియర్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్న రానా తమ్ముడు ?

సారాంశం

సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ నటిస్తున్న డెబ్యూ మూవీ 'అహింస'. చాలా కాలం నిరీక్షణ తర్వాత సురేష్ బాబు అభిరామ్ కెరీర్ ని హీరోగా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ నటిస్తున్న డెబ్యూ మూవీ 'అహింస'. చాలా కాలం నిరీక్షణ తర్వాత సురేష్ బాబు అభిరామ్ కెరీర్ ని హీరోగా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ బాబు టాలీవుడ్ లో బడా నిర్మాత కావడంతో అభిరామ్ డెబ్యూ మూవీ తెరకెక్కడం కేక్ వాక్ అని అంతా భావించారు. 

కానీ చూస్తుంటే పరిస్థితి అలా లేదు. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అభిరామ్ డైరెక్టర్ తేజకు తరచుగా ఇబ్బందులు సృష్టిస్తున్నాడట. అహింస షూటింగ్ త్వరగా ఫినిష్ చేయాలని తేజ ప్రయత్నిస్తుంటే అభిరామ్ ఏమాత్రం సహకరించడం లేదు అని సమాచారం. 

స్కూల్ లో పిల్లాడిలా కుంటి సాకులు చెబుతూ షూటింగ్ కి డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. అహింస షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక కేవలం వారం రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన షూట్ ని త్వరగా ఫినిష్ చేయాలని తేజ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇటీవల అభిరామ్ షూట్ లో కాలికి చిన్నగాయం అయింది. అది మరుసటిరోజుకు మానిపోయే గాయమే. 

కానీ అభిరామ్ కాలినెప్పిని సాకుగా చూపిస్తూ ఫ్రెండ్స్ తో పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తున్నాడట. తేజ డైరెక్టర్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ అభిరామ్ ని కంట్రోల్ చేయడం తేజ వల్ల కూడా కావడం లేదట. దీనితో అభిరామ్ మ్యాటర్ ని తేజ సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వ్యవహారంతో గతంలో అభిరామ్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి