‘గుంటూరు కారం’లో మొత్తం ఎన్ని సాంగ్స్? ఎప్పుడెప్పుడు రానున్నాయంటే.!

By Asianet News  |  First Published Jul 30, 2023, 9:18 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman)  భారీ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. 
 


టాలీవుడ్ లో ప్రస్తుతం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు మారుమోగుతోంది. బిగ్ స్టార్స్  సినిమాలకు థియేటర్లు దద్దరిల్లేలా సంగీతం అందిస్తున్నారు. బడా స్టార్స్ క్రేజ్ కు తగ్గట్టుగా మోతమోగిస్తున్నారు. ప్రస్తుతం ‘బ్రో’ చిత్రానికి తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ సినిమా ‘గుంటూరు కారం’ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

ఆ మధ్యలో థమన్  ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీటికి రీసెంట్ ఇంటర్వ్యూల్లో ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిపారు. కాగా, తాజాగా Guntur Kaaram  సినిమా మ్యూజిక్ కు సంబంధించిన అప్డేట్ అందింది. ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 

Latest Videos

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.  ఈ క్రమంలో మ్యూజిక్ సంబంధించిన అప్డేట్స్ ను కూడా వెంటవెంటనే అందించేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈరోజు నుంచి ప్రతి ఉదయం మ్యూజిక్ సిట్టింగ్స్  ను ప్రారంభించారు. దీంతో ప్రతి నెలా ఓ అదిరిపోయే సాంగ్ ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారంట. ఈ క్రమంలో మ్యూజిక్ పైనా మహేశ్ బాబు, త్రివిక్రమ్ మంచి శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. 

ఇక ఆ మధ్యలో సూపర్ స్టార్ క‌ృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ ను వదిలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచిఎలాంటి అప్డేట్ అందలేదు. ఈ క్రమంలో వరుసగా అప్డేట్స్ ను అందించేందుకు, సినిమాపై హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!