
సినీ పరిశ్రమలో బిజినెస్ లెక్కలు వేరుగా ఉంటాయి. తమ సినిమాలో చేస్తున్న నటులు ఎవరైనా వేరే సినిమాలతో క్లిక్ అయితే అంతకు మించిన ఆనందం వారికి ఉండదు. ఎందుకంటే ఆ మేరకు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతుంది. ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుంది. అదే క్రమంలో ‘యశోద’ రిజల్ట్ కోసం నిర్మాత కన్నా ఎక్కువ టెన్షన్ తో ఓ వ్యక్తి ఎదురుచూస్తున్నారు. ఆయన మరెవరో కాదు గుణ శేఖర్. మీకు ఇప్పటికి విషయం అర్దమైపోయి ఉంటుంది.
ఇప్పటికే యుఎస్ లో షోలు పడ్డాయి. ‘యశోద’ కు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. యశోద సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సమంత ఇరగదీసింది” అంటూ వారు చెప్పుతున్నారు.ఈ సినిమా పాజిటివ్ టాక్ కి సమంత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.మరి కొద్ది గంటల్లో ఇది ఏ స్దాయి సినిమా అనేది తేలిపోతుంది. సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా కావటంతో ట్రేడ్ దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. ఓపినింగ్స్ ఎలా ఉండబోతున్నాయి...ఫైనల్ టాక్ ఏమిటి..ఎంత కలెక్ట్ చేస్తుంది..నిర్మాతను ఒడ్డున పడేస్తుందా..లాభాలు తెచ్చిపెడుతుందా...మరో ప్రక్క సమంత..అనారోగ్యంతో.. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయింది. దాని ఇంపాక్ట్ ఏమిటి..వంటి విషయాలు డిస్కషన్ లో ఉంటున్నాయి. అవన్నీ మిగతా వారి కన్నా యశోద నిర్మాతకు, అలాగే సమంత తో సినిమా చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న గుణశేఖర్ కు అవసరం.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలమ్’నూ సమంత హీరోయిన్. ఆ సినిమాని కూడా సమంత ఇమేజ్‌ని నమ్ముకొని తీసారు. ఆమే మోయాలి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దగా బజ్ ఉండదు. కానీ సమంత ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. దాంతో ‘యశోద’ రిజల్ట్ కీలకం. ‘యశోద’ కన్నా ‘శాకుంతలమ్’కి భారీ బడ్జెట్ అయ్యిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో భాక్సాఫీస్ దగ్గర ‘యశోద’ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందనే కీలకం. ‘యశోద’ కలక్షన్లే... శాకుంతలమ్ సినిమాకి బిజినెస్ లెక్కలను డిసైడ్ చేస్తాయి. అందుకే గుణశేఖర్ చాలా టెన్షన్ గా యశోద భాక్సాఫీస్ ఫెరఫార్మెన్స్ ని గమనించాల్సిన పరిస్దితి.