కథలు ఉన్నవి ఏడే..వాటినే సినిమాలు తిప్పితిప్పి చెప్తూంటారనే అంటూంటారు. అందులో నిజమెంతో కానీ చాలా కథలు ..ఇంతకు ముందు వచ్చిన కథలు ఎక్సటెన్షన్ గానో లేక, ఓ వెర్షన్ గానో అనిపిస్తూంటాయి. హీరో మారగానే కథ కూడా మారిపోతుంది అంటారు. అలా వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కథ ఇంతకు ముందు వచ్చిందే అని జనం చూడటం మానరు..ఏ మాత్రం కొత్తగా అనిపించినా, బాగున్నా వందరోజులు పోస్టర్ వేయించేదాకా నిద్రపోరు. ఈ విషయం సినిమావాళ్లకు బాగా తెలుసు. అందుకే వారు అదే ఫార్ములాని ఫాలో అవుతూంటారు. ఇప్పుడు మారుతి,గోపీచంద్ కాంబినేషన్ లో ప్రారంభమైన ‘పక్కా కమర్షియల్’ సైతం ..ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ఓ వెర్షన్ అంటూ వినపడుతోంది.

వివరాల్లోకి వెళ్తే... `టెంపర్`లో ఎన్టీఆర్..బాగా బ్యాడ్ పోలీస్. లంచాలు తీసుకుంటూ తిమ్మిని,బమ్మి చేసేస్తూంటాడు. అలాంటివాడు విలన్ కు సాయిం చేసి ఆ తర్వాత దాని వలన వచ్చే పరిణామాలు చూసి భాదపడి,భాదితుల పక్షాన పోరాడతాడు. అక్కడ పోలీస్ ని తీసేసి ఓ లాయిర్ ని పెడితే అదే `పక్కా కమర్షియల్` సినిమా అంటున్నారు. `పక్కా కమర్షియల్` టైటిల్ కు తగ్గట్టే… హీరో క్యారక్టరైషన్ పూర్తి కమర్షియల్గా ఉంటూ, డబ్బు కోసం ఎలాంటి కేసునైనా ఒప్పుకుని వాదించి గెలిపిస్తాడట. అలాగే విలన్ కేసుని కూడా గెలిపించాక, అవతలి పార్టీ కళ్లల్లో నీళ్లు చూసాక మారి, ఆ విలన్ పైనే యుద్దం ప్రకటిస్తారట. అయితే ఈ సినిమా పూర్తి స్దాయి వినోదాత్మకంగా సాగుతుందని చెప్తున్నారు.
పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ అయిదో తారీకు మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాక ఈ సినిమాను అక్టోబరు ఒకటో తారీకున విడుదల చేస్తున్నామని కూడా యూనిట్ ప్రకటించింది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్ని వాసు, వంశీలు గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అలానే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపిక అయింది అని అంటున్నారు దాని మీద మాత్రం అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.
"ఈ రోజుల్లో", "బస్ స్టాప్"వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ మారుతి.. ఆ సినిమాలు విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలైన ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సినిమాల గురించి డైరెక్టర్ మారుతి చేస్తున్న సినిమా ఇదే.
డైరెక్టర్ మారుతి పదవ సినిమాగా గోపీచంద్ 29వ సినిమాగా తెరకెక్కించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, యు.వి. క్రియేషన్స్ కలసి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో వచ్చిన "బలే బలే మగాడివోయ్","ప్రతి రోజు పండగే" వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.