ఆక్సిజన్ మూవీతో దూసుకొస్తున్న గోపీచంద్

Published : Nov 15, 2016, 07:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆక్సిజన్ మూవీతో దూసుకొస్తున్న గోపీచంద్

సారాంశం

లౌక్యం తర్వాత మరో హిట్ మూవీ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఎఎం జోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ మూవీ హీరోగా గోపీచంద్ త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ బడ్జెట్ 30 కోట్ల పైనే.. 

బాక్సాఫిస్ దగ్గర స్ట్రయిట్ హిట్ కోసం చూస్తున్నాడు గోపీచంద్. లౌక్యం తర్వాత హిట్ లేని గోపీచంద్ టాలీవుడ్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు. అంతే కాదు..యాక్షన్ హీరోగా దుమ్మురేపేందుకు ప్రీపేర్ అవుతున్నాడు. ఏఎమ్ రత్నం తనయుడు  ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఆక్సీజన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు గోపీచంద్.

ఆక్సిజన్ మూవీలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అవీనితి పై ఓ ఆర్మీ ఆఫీసర్ పోరాటమే ఆక్సీజన్ చిత్రమట.  జగపతి బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.  ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2014లో లౌక్యంతో హిట్ అందుకున్నాడు గోపీచంద్. కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ చేసిన జిల్, సౌఖ్యం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న గోపీచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆక్సీజన్ లో గోపీచంద్ నుంచి ఆశిస్తున్న అన్నీ అంశాలు ఉంటాయట. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే