గొల్లపూడి మారుతీరావు సతీమణి మృతి.. ప్రముఖుల సంతాపం..

Published : Jan 29, 2022, 08:13 AM IST
గొల్లపూడి మారుతీరావు సతీమణి మృతి.. ప్రముఖుల సంతాపం..

సారాంశం

దివంగత నటుడు,రచయిత గొల్లపూడి మారుతీ(Gollapudi Maruthi Rao) రావు సతీమణి శివకామసుందరి(81) చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

దివంగత నటుడు,రచయిత గొల్లపూడి మారుతీ(Gollapudi Maruthi Rao) రావు సతీమణి శివకామసుందరి(81) చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

తెలుగునాట గొప్ప నటుడిగా..రచయితగా మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన వ్యక్తి గొల్లపూడి మారుతీరావు(Gollapudi Maruthi Rao). ఆయన సతీమణి గొల్లపూడి శివకామసుందరి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని వారి స్వగృహంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు ఆమె మరణించినట్టు తెలుస్తోంది. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో శివకామసుందరి మరణించారు.

వరంగల్ లోని హన్మకొండలో జన్మించారు శివకామసుందరి. 1961లో గొల్లపూడి మారుతీ రావు(Gollapudi Maruthi Rao)తో ఆమె వివాహం జరిగింది. అప్పటి నుంచి చెన్నైలోనే స్థిరపడిపోయారు వీరు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు మారినా... వారు చైన్నైలోనే ఉంటున్నారు. వీరే కాదు తెలుగు సినిమాకు చెందిన చాలా మంది అలనాటి తారలు ఇంకా చెన్నైలోనే ఉన్నారు.

2019 లో గొల్లపూరి మారుతీరావు(Gollapudi Maruthi Rao) అనారోగ్యంతో మరణించారు. ఆయనమరణానంతరం శివకామసుందరి వారి కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు(Gollapudi Maruthi Rao), శివకామసుందరి దంపతలుకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. గొల్లపూడివారి సతీమణి మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు.

PREV
click me!

Recommended Stories

Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే