Ghani: `గని`కి ఎంత పెట్టారు? ఎంత నష్టం

By Surya Prakash  |  First Published Apr 11, 2022, 11:14 AM IST


గ‌ని చిత్రం తొలి రోజు మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది ఈ క్ర‌మంలో క‌లెక్ష‌న్స్ డౌన్ అవుతూ వ‌స్తున్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు


భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ చిత్రం గ‌ని. స్పోర్ట్స్ డ్రామాలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్నింగ్ షో డివైడ్ టాక్ తెచ్చుకుంది. పరమ రొటీన్ కథా,కథనాలతో  ఎక్కడా ఎమోషన్స్ పండకుండా రూపొందిందీ చిత్రం. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో అసలు బిజినెస్ ను అసలు ఏ దశలో కూడా అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిందనే చెప్పాలి. వీక్ డేస్ లో సినిమా ఇక తేరుకోలేకపోయిందనే చెప్పాలి.   సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అలాగే శ్రీరామనవమి కూడా అయినప్పటికీ కూడా టార్గెట్ ను కొంచెం కూడా అందుకునే ప్రయత్నం చేయలేదు.  

  సినిమా 25.3 కోట్ల బిజినెస్ తో 26.30 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే కంప్లీట్ గా ట్రాక్ తప్పింది అని చెప్పాలి. మూడు కోట్లు కూడా రికవరీ కాలేదంటున్నారు. ఇంకా 23 కోట్లు రికవరీ అవ్వాల్సి ఉంది. జనం ఇంకా ఆర్.ఆర్.ఆర్. హ్యాంగోవర్ లోనే ఉన్నారు. దాంతో ఈ సినిమాకు మినిమం ఓపినింగ్స్ కూడా రాలేదు. బ్యాడ్ మౌత్ టాక్, నెగిటివ్ రివ్యూలు రావటంతో సినిమా కొంచెం కూడా పికప్ కాలేకపోయింది. చాలా చోట్ల శనివారం ఆర్.ఆర్.ఆర్ ని వేసేసారు. కేజీఎఫ్,బీస్ట్ వచ్చాక ఆ కాస్త థియోటర్స్ ని కూడా ఉండకపోవచ్చు. ఎవరికీ ఈ సినిమాపై ఆసక్తి లేదు.

Latest Videos

undefined

గ‌ని చిత్రం తొలి రోజు మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది ఈ క్ర‌మంలో క‌లెక్ష‌న్స్ డౌన్ అవుతూ వ‌స్తున్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. ఏ విధంగా కష్టపడ్డాడనే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయ‌గా, అది చూసి ఫ్యాన్స్ అవాక్క‌య్యారు. కానీ అవేమీ ఓపినింగ్స్ కు కలిసి రాలేదు.

ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు నటించారు. ‘గని’ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఇక వరుణ్ తేజ్ ‘గని సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

click me!