ఈమె ట్రెండ్ సెట్‌ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌.. గుర్తు పట్టారా..?

Published : May 15, 2020, 04:49 PM IST
ఈమె ట్రెండ్ సెట్‌ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌.. గుర్తు పట్టారా..?

సారాంశం

లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. మన్మథుడు నాగార్జున ఇమేజ్‌ను మార్చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. అసలు గీతాంజలి సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తికాదేమో. ప్రేమ వ్యవహారం అంటేనే తప్పుగా భావించే కాలంలో హీరోయిన్‌ బిగ్గరగా లేచిపోదామా అని డైలాగ్ పెట్టడం ఓ సాహసమే.

ఇండియన్ స్క్రీన్ మీద ఎంతో మంది అందాల భామలు వచ్చారు తరువాత కనుమరుగయ్యారు. వీళ్ల కొంత మంది తమకంటూ ఓ మార్క్ వేసుకోగా, మరికొందరు ఏం సాధించకుండానే తెరమరుగయ్యారు. మరికొందరైతే చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఎప్పటికీ నిలిచిపోయే నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఓ అరుదైన నటే గిరిజా. ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోయినా ఈ నటి పోషించిన పాత్ర మాత్రం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే.

లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. మన్మథుడు నాగార్జున ఇమేజ్‌ను మార్చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. అసలు గీతాంజలి సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తికాదేమో. ప్రేమ వ్యవహారం అంటేనే తప్పుగా భావించే కాలంలో హీరోయిన్‌ బిగ్గరగా లేచిపోదామా అని డైలాగ్ పెట్టడం ఓ సాహసమే. అంతేకాదు కౌగిలింతలే అరుదుగా కనిపించే సమయంలో ఓ పాట మొత్తం లిప్‌లాక్‌తో తెరకెక్కించటం ఓ అరుదైన రికార్డ్‌.

అలాంటి క్లాసిక్ హిట్‌లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ గిరిజ. ఎన్నారై అయిన ఈ భామ కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. గీతాంజలి తరువాత మలయాళంలో వందనం, తెలుగులో హృదయాంజలి సినిమాల్లో కనిపించింది. తరువాత వెండితెరకు మాత్రమే కాదు, పబ్లిక్ లైఫ్‌కే దూరమైంది గిరిజ. తాజాగా ఈ భామ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల గీతాంజలి సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇంటర్వ్యూలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది గిరిజా. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది.

అయితే ఈ భామ ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. 20 ఏళ్ల వయసులో హీరోయినగా వెండితెర మీద సందడి చేసి ఈ భామ వయసు ప్రస్తుతం 5 పదులు దాటింది. దీంతో వయసు రీత్యా వచ్చిన మార్పులతో గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న గిరిజ Interested observer.అనే ట్విటర్‌ ఎకౌంట్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఆ ఎకౌంట్ ప్రొఫైల్‌ ఫోటో చూసి అంతా షాక్‌ అయ్యారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా