నాన్ బాహుబలి రికార్డ్ 'గీత గోవిందం' సొంతం!

Published : Sep 01, 2018, 11:12 AM ISTUpdated : Sep 09, 2018, 11:48 AM IST
నాన్ బాహుబలి రికార్డ్ 'గీత గోవిందం' సొంతం!

సారాంశం

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి తన సత్తా చాటింది.

ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఊహించని విధంగా ఘన విజయం అందుకున్న ఈ సినిమా సక్సెస్ ని చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డును తమిళనాడులో బద్దలు కొట్టింది. అక్కడ రూ.5 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతుంది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించింది. సినిమాలో లీడ్ పెయిర్ నటనతో పాటు గోపి సుందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా మిగిలాయి. రాను రాను ఈ సినిమా మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి