
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్ లీలా బన్సాలీ సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన కథలను గమ్మత్తైన విధంగా వివరిస్తూ.. వీక్షకులను తన విజువల్స్‌తో అనుభూతి చెందేలా చేస్తూంటారు. అటువంటి దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్.
అయితే ‘గంగూబాయి కతియావాడి’అనుకున్న రీతిలో అలరించలేకపోయిందనే టాక్ వినిపించింది. తెలుగులోనూ ఈ సినిమాని మేకర్స్ విడుదల చేశారు. ఇక్కడా వర్కవుట్ కాలేదు. సరైన ప్రమోషన్ లేకపోవటంతో పట్టించుకునే వాళ్లే కరువు అయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నెట్ ప్లిక్స్ ఓటిటిలో విడుదల కానుంది. ఏప్రియల్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది.
గంగూబాయ్ ను వేశ్యగా మార్చిన విధానం, ఆ వృత్తిలో ఆమె ఎదిగిన తీరు, రాజకీయ నాయకుల గురించి ఆమె చెప్పే డైలాగులు ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. ఈ చిత్రం పవర్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కింది. ఇక గంగూబాయిగా ఆలియా అరిపించేసింది. ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఒక నటిగా ఆలియాకి ఇది చాలెంజింగ్ పాత్ర అని చెప్పవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ విడుదలై క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తెలుగులో కూడా మంచి స్పందనను రాబట్టుకుంటుందని బాలీవుడ్ విశ్లేషకుల అంచనా. కాగా, అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మించింది.