
మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన కంప్లీట్ యాక్షన్ ఎంట్రైనర్ మూవీ ఇంద్ర. అప్పటి వరకు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ టచ్ చేయని మెగాస్టార్ చిరంజీవి. ఇంద్ర సినిమాతో రాయలసీమ రాజసాన్ని పలికించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో, పవర్ ప్యాక్ పెర్ఫామెన్స్ తో ఇంద్ర సినిమా మెగా ఫ్యాన్స్ కు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చింది.
బి గోపాల్ డైరెక్షన్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఇంద్ర రిలీజ్ అయ్యి ఈరోజుతో( 24 జులై) సరిగ్గా 20 ఏళ్లు అవుతుంది. 2002 జులై 24న విడుదలైంది సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఇంద్ర సినిమాను నిర్మించారు. అప్పట్లోనే దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. కాసులు పంట పండించింది.
ఇక ఇంద్ర సేనా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించగా.. హీరోయిన్లుగా అప్పటి టాప్ స్టార్స్ ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే సందడి చేశారు. వీరితో పాటు ముఖేశ్ రుషి, పునీత్ ఇస్సార్, ప్రకాశ్‌రాజ్, తణికెళ్లభరణి, శివాజీ, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, అల్లు రామలింగయ్య లాంటి స్టార్స్ ఇంద్ర సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా బ్రహ్మానందం,ఏంఎస్ నారాయణ, ఏవీఎస్, దర్మవరపు కామెడీ ట్రాక్స్ ఈసినిమాకే హైలెట్స్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సీన్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో అంతా ఒక ఎత్తైతే..మెగాస్టార్ చిరంజీవి నటన మరో ఎత్తు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది, మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా అంటూ చిరు చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతుంటాయి. ఇంద్రాలో చిరు డైలాగ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాయో అందరికి తెలుసు. ఈ డైలాగ్స్ ను ఇప్పటికీ సినిమాల్లో స్పెషల్ సిచ్యూవేషన్స్ లో ఉపయోగిస్తూనే ఉంటారు. ఆ డైలాగ్స్ సే.. ఆడియన్స్ ను థియేటర్లలో కట్టిపడేశాయి.
ఇక చిరంజీవి తో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాంబినేషన్ కలిస్తే.. అది హిట్ ఆల్బమ్ అని పక్కాగా ఫిక్స్ అయ్యి ఉంటారు ఆడియన్స్. అప్పట్లో ఇంద్ర మూవీ మ్యూజిక్ కాసెట్స్ కు ఎంతో డిమాండ్ ఉండేది. ఇంద్ర సినిమాలో మణిశ్రమ కంపోజిషన్‌లో వచ్చిన పాటలన్నీ ఆల్‌టైమ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇంద్ర 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైంది. మెగా బ్లాక్ బాస్టర్ 2 దశాబ్దాల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం..అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.