‘‘బిగ్ బాస్ లో మొత్తం బూతులే.. షోని ఆపేయండి’’

Published : Jul 06, 2018, 11:32 AM IST
‘‘బిగ్ బాస్ లో మొత్తం బూతులే.. షోని ఆపేయండి’’

సారాంశం

*బిగ్ బాస్ పై మండిపడుతున్న పలు సంఘాలు *షో ఆపేయాలంటూ ఆఫీస్ ముట్టడి


తమిళ బిగ్ బాస్ షో కి మళ్లీ చిక్కులు వచ్చి పడ్డాయి. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షో అశ్లీలంగా, ఉందని పచ్చిబూతులు మాటలు, వ్యవహారాలు నడుస్తున్నాయని హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న చెన్నైలోని విజయ్‌ టీవీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి.

టీవీ యాజమాన్యానికి, కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ సంస్కృతిని, తమిళుల కుటుంబ విలువలను మంటగలుపుతున్న ఈ షోను నిలిపేకయపోతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. ‘జనం ఎప్పుడో ఓసారి వెళ్లి చూసే సినిమాలకే సెన్సార్ ఉంది. అలాంటి రోజూ ఇంట్లో చూసే ఈ షోకు సెన్సార్ లేకపోవడం దారుణం. వారి మాటలు, చేష్టలు చూస్తోంటే రోత పుడుతోంది. పిల్లలు పాడయిపోతున్నారు.. ’ అని హిందూ మక్కల్ కచ్చి నేత సెంధిల్ ఆరోపించారు. టీవీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.    
 

PREV
click me!

Recommended Stories

MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్