మెగా కంఠం నుంచి ‘నేనొక నటుడ్ని’ షాయరీ.. మనస్సును కదిలిస్తున్న ‘రంగమార్తాండ’ ఫస్ట్ సింగిల్!

By team teluguFirst Published Dec 21, 2022, 5:02 PM IST
Highlights

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన షాయరీని మనస్సును కదిలించేలా చెప్పారు. ‘నేనొక నటుడిని’ అంటూ సాగే కవిత్వం మెగా కంఠంతో మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్‌, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా వస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న షాయరీ కొద్ది సేపటి కింద విడుదలైంది. 

‘నేనొక నటుడ్ని..’ అంటూ సాగే ఈ షాయరీని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన కంఠంతో  ప్రేక్షకుల మనస్సును కదిలించేలా చెప్పారు. ‘రంగమార్తాండ’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ గా ఈ షాయరీని విడుదల చేశారు. చిరు తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీని వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రచించారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయరీకి ప్రాణం పోశారు. 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే, ఫస్ట్ సింగిల్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

 

అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం♥️🙏
ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీభూపాల్ అందమైన అక్షరరూపం. సంగీతదైవం ఇళయరాజా గంథర్వస్వరాలతో. నటమర్తాండ అపురూప గళమాథుర్యంలో...

మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు🙏❤https://t.co/Vmvm9vXhfH

— Krishna Vamsi (@director_kv)
click me!