పెళ్లి చేసుకుంటానని మోసం..కంగనా రనౌత్‌ బాడీగార్డ్ పై రేప్‌ కేసు నమోదు

Published : May 22, 2021, 09:46 AM IST
పెళ్లి చేసుకుంటానని మోసం..కంగనా రనౌత్‌ బాడీగార్డ్ పై రేప్‌ కేసు నమోదు

సారాంశం

కంగనా రనౌత్‌ బాడీ గార్డ్ కుమార్‌ హెగ్డేపై ముంబయిలోని డిఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రేప్‌ కేసు నమోదైంది. 

కంగనా రనౌత్‌ బాడీ గార్డ్ కుమార్‌ హెగ్డేపై ముంబయిలోని డిఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రేప్‌ కేసు నమోదైంది. తనని మ్యారేజ్‌ చేసుకుంటానని, బలవంతంగా రేప్‌ చేశాడని, ఇప్పుడు మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితురాలు బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. 

తమకి ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని, గత ఏడాదిజూన్‌లోనే తనని వివాహం చేసుకుంటాడని హామీ ఇచ్చినట్టు పేర్కొంది. తనని బలవంతంగా లైవ్‌ ఇన్‌ సంబంధానికి ఒత్తిడిచేశాడని, తన అంగీకారంతో సంబంధం లేకుండా తనని రేప్‌ చేశాడని తెలిపింది. తాను అతను మ్యారేజ్‌ చేసుకుంటాడని ఆశించినట్టు, కానీ ఇప్పుడు మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు తల్లి ఆరోగ్యం బాగా లేదని తన నుంచి యాభై వేలు అప్పుగా తీసుకున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఐపీసీ సెక్షన్స్ 376, 377,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌