Adipurush Teaser: నా ఆగమనం అధర్మ విధ్వంసం... విజువల్ వండర్ గా ఆదిపురుష్ టీజర్

Published : Oct 02, 2022, 07:38 PM ISTUpdated : Oct 02, 2022, 07:58 PM IST
Adipurush Teaser: నా ఆగమనం అధర్మ విధ్వంసం... విజువల్ వండర్ గా ఆదిపురుష్ టీజర్

సారాంశం

ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.    

ఆదిపురుష్ ప్రకటనతోనే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రామాయణ గాథ చేయడం, రామునిగా నటించడంతో ఒక్కసారిగా హైప్ ఏర్పడింది. ఇక రామునిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది? దర్శకుడు ఆయన్ని ఎలా చూపిస్తారు? అనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. దాదాపు రెండేళ్లుగా ఫ్యాన్స్, సినిమా లవర్స్ దీని కోసం ఎదురు చూశారు. సెప్టెంబర్ 30న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రభాస్ లో సరికొత్త రాముణ్ణి ఆవిష్కరించారు. కోరం మీసంలో పంచె కట్టు, యుద్ధ కవచాలు ధరించివిల్లు ఆకాశంలోకి ఎక్కుపెట్టిన ప్రభాస్ రౌద్ర రామునిగా ఆకట్టుకున్నాడు. 

ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకర్షించింది. ఇక నేడు మూవీ టీజర్ విడుదల చేయగా.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించింది. అబ్బురపరిచే యుద్ధ సన్నివేశాలు, మైమరిపించే విజువల్స్ తో టీజర్ సాగింది. 1:46 నిమిషాల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 'భూమి క్రుంగినా నింగి చీలినా న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం', 'వస్తున్నా న్యాయం రెండు పాదాలతో నీ పదితలల అన్యాయాన్ని అణచివేయడానికి', 'నా ఆగమనం అధర్మ విధ్వంసం', అని ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ కలిగించాయి. రామునిగా ప్రభాస్ లుక్ మెప్పించింది. హీరోయిన్ కృతి సనన్ సీత లుక్ లో చాలా అందంగా ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.సైఫ్ మోడ్రన్ రావణాసురుడ్ని తలపించారు. బీజీఎం సైతం టీజర్ కి ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఆదిపురుష్ టీజర్ అద్భుతంగా ఉంది.  


దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. విజువల్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?