క్రేజీ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. అల్లు అర్జున్ 'ఐకాన్' హీరోయిన్ ఎవరంటే!

Published : Jul 09, 2019, 04:05 PM IST
క్రేజీ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. అల్లు అర్జున్ 'ఐకాన్' హీరోయిన్ ఎవరంటే!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రమంగా వేగం పెంచుతున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్నీ నుంచి మరో చిత్రం రాలేదు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్నీ ప్రస్తుతం నటిస్తున్నాడు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రమంగా వేగం పెంచుతున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్నీ నుంచి మరో చిత్రం రాలేదు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్నీ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా బన్నీ చిత్రం ప్రారంభం కాబోతోంది. 

ఈ చిత్రానికి ఇప్పటికే 'ఐకాన్' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ నటీ నటుల్ని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ చిత్రం చివరి దశకు చేరుకోగానే ఐకాన్ షూటింగ్ ప్రారంభించాలనేది ప్లాన్. 

ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. క్రేజీ బ్యూటీ రాశి ఖన్నాని దర్శకుడు హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఇటీవలే రాశి ఖన్నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్, కథాంశం విభిన్నంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు