Latest Videos

షాకింగ్..ప్రభాస్ మూవీ అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్..షోలన్నీ హౌస్ ఫుల్ 

By tirumala ANFirst Published Jun 23, 2024, 9:28 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని అంతా భావిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని అంతా భావిస్తున్నారు. మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ కల్కి చిత్రంతో అడ్వాంటేజ్ పొందాలని చూసారో ఏమో కానీ రాజశేఖర్ కల్కి చిత్రాన్ని కూడా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీనితో ప్రభాస్ అభిమానులు చాలా మంది కూకట్ పల్లి భ్రమరాంబ లాంటి థియేటర్ లో ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ కల్కి చిత్రానికి తప్పుగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. 

ఇలా మిస్టేక్ వల్లే దాదాపు రాజశేఖర్ సినిమాకి 6 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఆ తర్వాత ఇది ప్రభాస్ సినిమా కాదని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. బుక్ మై షోను దారుణంగా తిడుతున్నారు. 

దీనితో బుక్ మై షో సంస్థ స్పందించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు అదోనళన చెందాల్సిన అవసరం లేదని అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Naaku assalu sammandham ledhu 😅🤣

Jokes apart...
Wishing dear , Maa garu , The stellar cast and crew all the very very best!
May you create history and take the film industry a step ahead https://t.co/P00OyIZFVE

— Dr.Rajasekhar (@ActorRajasekhar)

దీనిపై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు. ఆయన రెస్పాన్స్ ఫన్నీగా ఉంది. నాకసలు సంబంధం లేదు.. జస్ట్ జొకింగ్. డియర్ ప్రభాస్, నాగ్ అశ్విన్ లకు నా శుభాకాంక్షలు. వైజయంతి మూవీస్, దత్తు గారికి ఆల్ ది బెస్ట్. కల్కి 2898 AD చిత్రంతో చరిత్ర సృష్టిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దీనిపై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు. ఆయన రెస్పాన్స్ ఫన్నీగా ఉంది. నాకసలు సంబంధం లేదు.. జస్ట్ జొకింగ్. డియర్ ప్రభాస్, నాగ్ అశ్విన్ లకు నా శుభాకాంక్షలు. వైజయంతి మూవీస్, దత్తు గారికి ఆల్ ది బెస్ట్. కల్కి 2898 AD చిత్రంతో చరిత్ర సృష్టిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. 

click me!