త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు రెడీ అవుతోంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ సినిమాను ఫిబ్రవరిలో అనుకూలమైన మంచి తేదీని చూసుకుని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ని పిబ్రవరి 8 కు పెట్టుకోమంటూ ప్యాన్స్ సోషల్ మీడియాలో సూచిస్తున్నారు.
అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బయోపిక్ గా వస్తున్న #Yatra2 పిభ్రవరి 8న రిలీజ్ అవుతోంది. రాజకీయంగా పవన్, జగన్ ఇద్దరూ ప్రత్యర్దులు కాబట్టి... ఆ రోజు రిలీజ్ డేట్ గా పెడితే భాక్సీఫీస్ దగ్గర పోటీ రసవత్తంగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా #Yatra2 కన్నా మంచి ఓపినింగ్స్ రావటానికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం చేస్తారనటంలో సందేహం లేదు. కాబట్టి నట్టికుమార్ ఈ సూచనను ముందుకు తీసుకు వెళ్తే బాగానే ఉంటుంది.
ఇక దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012వ సంవత్సరం అక్టోబర్ లో 1600 పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించింది.
రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా కనిపిస్తారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదురించే దైర్యశాలిగా గంగను ఆకట్టుకుంటాడు. రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే బావుంటుందని భావించిన టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ అతనిని జర్నలిస్టుగా చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కధాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. మణిశర్మ సంగీతం, శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.