ఎవడ్రా మాస్... మహేష్-ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్!


సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యే కొద్దీ ఫ్యాన్ వార్స్ పెరుగుతున్నాయి. నిన్న మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదలైంది. ఇది ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్ మధ్య గొడవకు కారణమైంది. 

fan war between mahesh babu and ntr ksr

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. లెజెండ్ కృష్ణ జయంతి నేపథ్యంలో ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. మహేష్ నెవెర్ బిఫోర్ ఊరమాస్ అవతార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపింది. బీడీ తాగుతూ రౌడీలను మహేష్ ఇరగొట్టడం బాగుంది. ఫ్యాన్స్ మాస్ అంటే మావాడే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ షురూ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అని చెప్పుకునే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ కి నొచ్చుకున్నారు. 

వారికి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టారు. మాస్ కి అసలైన నిర్వచనం ఎన్టీఆర్ అని వాదానికి దిగారు. అలా చిలికి చిలికి గాలివానగా... ఫ్యాన్ వార్ కి దారి తీసింది. నిన్నటి నుండి ఎన్టీఆర్-మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరిని మరొకరిని కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ ని మిగతా హీరోల ఫ్యాన్స్ ఆసక్తికరంగా గమనిస్తున్నారు. 

NTR - Face of Indian Cinema on the Oscars stage

Mahesh Bob:- Face of Padamati Sandhya Ragam serial

Ee serial star gadi fans mammalni anatam 🤣🤣 https://t.co/q5CCdYIiJN pic.twitter.com/pmAWrgYeLJ

— Saitejaᵛᵃˢᵗᵘⁿⁿᵃ (@Saiteja1631)

Latest Videos

ఒకే కుటుంబానికి చెందిన హీరోల మధ్య కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఎన్టీఆర్-మహేష్ ఫ్యాన్ వార్ ఊహించనిదేమీ కాదు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ మధ్య మహేష్, ఎన్టీఆర్, చరణ్ తరచుగా కలిసేవారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆ వేదికపై వీరి సంభాషణ ఇరు హీరోల ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 

Em chestham Indian cinema ki okkade MAHESH BABU !! pic.twitter.com/YRj8fNaijW

— R R (@RacchaRidhvik)

తాజాగా జరుగుతున్న ఈ వార్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి. గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది 

ఇక ఎన్టీఆర్ దేవర చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. 
 

vuukle one pixel image
click me!