Fan War Between Ram and Nani: ది వారియర్ పెట్టిన చిచ్చు...  నాని-రామ్ మధ్య ఫ్యాన్ వార్! 

Published : Jul 16, 2022, 03:56 PM IST
Fan War Between Ram and Nani: ది వారియర్ పెట్టిన చిచ్చు...  నాని-రామ్ మధ్య ఫ్యాన్ వార్! 

సారాంశం

టైర్ టు హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియా వార్స్ చోటు చేసుకుంటున్నాయి. కలెక్షన్స్, రికార్డ్స్ తెరపైకి తెస్తూ ట్విట్టర్ పోరుకు దిగుతున్నారు. తాజాగా హీరోలు నాని, రామ్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది.   

సాధారణంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్స్ కి దిగుతారు. ఈ మధ్య టైర్ టు హీరోలు కూడా అసలు తగ్గడం లేదు. నాగ చైతన్య(Naga Chaitanya), నాని, రామ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల  యుద్ధం నడుస్తుంది. తాజాగా నాని(Nani), రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రామ్ నటించిన ది వారియర్ విడుదల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ప్లాప్ తెచ్చుకున్న ది వారియర్ ఓపెనింగ్ డే ఏపీ/తెలంగాణలో దాదాపు రూ. 7 కోట్ల షేర్ రాబట్టింది. దీన్ని ప్రస్తావిస్తూ నెగిటివ్ టాక్ లో మా హీరో ఈ రేంజ్ వసూళ్లు సాధించారని రామ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

అదే సమయంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికీ కేవలం రూ. 3 కోట్లు మాత్రమే రాబట్టిందని ఎగతాళి చేస్తున్నారు. అలాగే నాని వి, టక్ జగదీష్ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇదే ప్రస్తావిస్తూ రామ్ (Ram Pothineni)ఫ్యాన్స్ నాని ఓటీటీ హీరో అంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇక రామ్ ఫ్యాన్స్  కామెంట్స్ ని నాని ఫ్యాన్స్ అదే స్థాయిలో తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ది వారియర్ ఒక చెత్త సినిమా అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. 

గత రెండు రోజులుగా ఈ ట్విట్టర్ వార్ నడుస్తుంది. టైర్ టూ హీరోల్లో మావాడు గొప్పంటే మావాడు అంటూ కౌంటర్లు విసురుకుంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ కారణంగా సినిమాలు దెబ్బతింటున్నాయి. ఒక హీరో మూవీ విడుదల కాగానే యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే పనిలో ఉంటున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసమే ది వారియర్ మేకర్స్ యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరపలేదు. అది ఒకింత సినిమాకు మేలు చేసింది. జులై 13 అర్థరాత్రే టాక్ బయటికి వచ్చి ఉంటే ఆ మాత్రం ఓపెనింగ్స్ కూడా దక్కేవి కావు. 

టాలీవుడ్ క్రిటిక్స్ ది వారియర్(The Warriorr) చిత్రానికి నెగిటివ్ మార్క్స్ వేశారు. మేజర్ సైట్స్ 2.5  రేటింగ్ మాత్రమే ఇచ్చాయి.  దాని ప్రభావం సెకండ్ డే కనిపించింది. రెండో రోజు యాభై శాతానికి పైగా డ్రాప్ కనిపించింది. సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 2.5 కోట్లు వచ్చాయని కొన్ని సైట్స్ రిపోర్ట్ చేశాయి. రూ. 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ది వారియర్ వీకెండ్ ఘనంగా ముగిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేవు. ఇక లింగుస్వామి తెరకెక్కించిన ది వారియర్ మూవీ హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. దేవిశ్రీ సంగీతం అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?