`ఫ్యామిలీ స్టార్‌` రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. ఎన్టీఆర్‌ తప్పుకోవడం ఖాయమే?

By Aithagoni Raju  |  First Published Feb 2, 2024, 5:14 PM IST

విజయ్‌ దేవరకొండ తన `ఫ్యామిలీ స్టార్‌`తో వచ్చే డేట్‌ ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్‌ డేట్‌నే ఫిక్స్ చేసుకున్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు.


ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` మూవీ వాయిదా పడుతుందని చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో, ఫిల్మ్ నగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ దేవరకొండ ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేశాడు. తన సినిమాతో ఈ విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. విజయ్‌ నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్‌` మూవీ రిలీజ్‌ డేట్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. `దేవర` వాయిదా పడితే ఆ డేట్‌కి వస్తామని ఇటీవల నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. తాజాగా విజయ్‌ తన `ఫ్యామిలీ స్టార్‌` రిలీజ్‌ డేట్‌ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించడం విశేషం. 

విజయ్‌ దేవరకొండ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా, పరశురామ్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపందుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మొదట `ఫ్యామిలీ స్టార్‌`ని సంక్రాంతికే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌ కంప్లీట్‌ కాకపోవడంతో వాయిదా వేశారు. పైగా సంక్రాంతి పోటీ మధ్య నలిగిపోవడం ఎందుకని దిల్రాజు ముందస్తుగా ప్లాన్‌ చేశాడు. ఇక ఇప్పుడు సింగిల్‌ డేట్‌తో, లాంగ్‌ వీకెండ్‌తో రాబోతున్నారు. 

Latest Videos

మొదట `దేవర` చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ వీఎఫ్‌ఎక్స్, ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమాని వాయిదా వేయాలనుకుంటున్నారట. దీంతో ఆ డేట్‌కి `ఫ్యామిలీ స్టార్‌`ని దించుతున్నారు దిల్‌ రాజు. అయితే ఆ సమయంలో ఇప్పటి వరకు మరే సినిమా ప్రకటించలేదు. దీంతో సింగిల్‌గా రాబోతున్నారని చెప్పొచ్చు. వస్తే ఒకటి రెండు మిడిల్‌ రేంజ్‌ మూవీస్‌ రావచ్చు. కానీ లాంగ్‌ వీకెండ్‌, సమ్మర్‌ సెలవులు ఈ మూవీకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 5 శుక్రవారం, ఆ తర్వాత శనివారం, ఆదివారం కలిసి వస్తాయి. దీంతోపాటు ఎనిమిదిన ఉగాది పండగ ఉంది. ఆ తర్వాత రోజు కూడా కలిసి వస్తుంది. ఇలా లాంగ్‌ వీకెండ్‌ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడనుంది. ఓ రకంగా `ఫ్యామిలీ స్టార్‌`కి పండగే అని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంది. మగతనం చూపించాలంటే ఐరనే వంచాలా ఏంటి? అని చెప్పే సింగిల్‌ డైలాగ్‌తో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా కామెడీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. 

click me!