టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో వారసుడు..

Published : Mar 05, 2022, 10:55 AM IST
టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో వారసుడు..

సారాంశం

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు హవా చూపిస్తున్నారు. ఇంకా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. త్వరలో మరో వారసుడి ఎంట్రీ జరగబోతోంది. 

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు హవా చూపిస్తున్నారు. ఇంకా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. త్వరలో మరో వారసుడి ఎంట్రీ జరగబోతోంది. 

టాలీవుడ్ లో స్టార్ సీనియర్ స్టార్ హీరోల వారసులకు కొదవ లేదు. వారి తనయులు చాలా మంది హీరోలుగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేక సైలెంట్ అయిపోయారు. ఇంకొంత మంది స్టార్స్ తనయులు  సరైన సమయంలో  ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికోసమే ఫుల్ ప్రిపేర్ అవుతూ.. కసరత్తు చేస్తున్నారు. ఫారెన్ వెళ్లి మరీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 

ఇక ఇప్పుడు అలాంటి ఎంట్రీనే మరోకటి జరగబోతోంది. సీనియర్ స్టార్ హీరో  వినోద్ కుమార్ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే హీరోగా అతని ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వినోద్ కుమార్ ప్రకటించారు.    

90 దశకంలో ఇండస్ట్రీని ఊపు ఊపిన హీరోలలో వినోద్ కుమార్ కూడా ఒకరు. హీరోగా వరుస సినిమాలతో వినోద్ కుమార్ దూసుకుపోయాడు. స్టార్ హీరోలు మాస్ సినిమాల తో దడదడలాడిస్తుంటే.. ఫ్యామిలీ హీరోగా వినోద్ కుమార్ తన మార్క్ చూపించారు మౌన పోరాటం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వినోద్ కుమార్, చాలా తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యాడు. 

వినోద్ కుమార్ ఖాతాలో సీతారత్నంగారి అబ్బాయి, మామగారు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సిక్స్ ఫీట్ తో హ్యాండ్సమ్ లుక్ లో ఉండే వినోద్ కుమార్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించారు. ఆతరువాత కొంత కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరం అయిన వినోద్ కుమార్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. 

రీసెంట్ గా వినోద్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. అందులో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని చెప్పారు. బేసిక్ గా కన్నడ  హీరో అయిన వినోద్.. తెలుగులోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, తెలుగు సినిమాతోనే తన తనయుడి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాడని అన్నాడు. మంచి కథ కోసం  ఎదురు చూస్తున్నామన్నారు వినోద్ కుమార్. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?