
‘ఎఫ్2’తో తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో నవ్వించారు అనిల్ రావిపూడి. దానికి సీక్వెల్ గా వుస్తున్న చిత్రం ‘ఎఫ్3’ (F3). ఈ మూవీతో మరోసారి నవ్వుల పండుగ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్ పై అప్డేట్ అందించారు.
ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ..’తో ఆడియెన్స్ ను ఆకట్టకుంటున్నారు ఎఫ్3 టీం. మనీ వల్ల వచ్చే ఫ్రస్టేషన్.. మనీ ఉంటే చేయలేనిదే ఏమీ లేదనేలా ఫస్ట్ సింగిల్ ను వదిలారు. ఈ చిత్రంలో మనీ ప్రాధాన్యతను అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో అర్థమవుతోంది. తాజాగా సెకండ్ సింగిల్ ను ‘వూ ఆ అహ అహ’ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్టు అప్డేట్ అందించారు. ఏప్రిల్ 22న ఈ లికికల్ వీడియో నెట్టింట దుమ్ములేపనుంది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మంచి ట్యూన్ అందించారని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసించారు. ఫస్ట్ సింగిల్ ఎంతలా ఆకట్టుకుందో.. అదే స్థాయిలో Woo Aaa Aha Aha సాంగ్ కూడా అలరిస్తుందని అనిల్ ప్రామీస్ చేశాడు. ఇక ఈ అప్డేట్ అందిస్తూ ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లు తాడుతో తమ బలాబలాలను నిరూపించేకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
విక్టరీ వెంకటేష్ Venkatesh, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tej కథనాయకులుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.