#ExtraOrdinaryMan:ప్రీ రిలీజ్ బిజనెస్ లెక్కలు, బ్రేక్ ఈవెన్ ఎంత

By Surya PrakashFirst Published Dec 5, 2023, 9:17 AM IST
Highlights

 'నా పేరు సూర్య' లాంటి భారీ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కించిన వ‌క్కంతం ఇప్పుడు అందుకు పూర్తి భిన్న‌మైన నేప‌థ్యాన్ని ఎంచుకుని నితిన్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీని తెర‌కెక్కిస్తుండ‌డం ...


 నితిన్ కు గత కొంతకాలంగా హిట్ లేదు. ముఖ్యంగా ఆయన గత చిత్రం మాచర్ల నియోజక వర్గం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు నితిన్ పెద్ద హిట్ కొట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ క్రమంలో నితిన్ హీరోగా వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' రిలీజ్ కు రెడీ అయ్యింది. హ్యాపినింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా  పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన సింగిల్స్, టీజ‌ర్, ట్రైలర్ ఆక‌ట్టుకున్నాయి.మూడు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత అనే డిటేల్స్ చూద్దాం.

నైజాం  – 7 Cr (ఓన్ రిలీజ్)
సీడెడ్  – 3 Cr ఎన్ ఆర్ఎ.
ఆంధ్రా – 9 Cr ఎన్ ఆర్ ఎ 
రెస్టాఫ్ ఇండియా  – 1.5 Cr
ఓవర్ సీస్  – 2.5Cr
 

Latest Videos

మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్లు అయ్యింది.  ఇరవై కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు.

 'నా పేరు సూర్య' లాంటి భారీ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కించిన వ‌క్కంతం ఇప్పుడు అందుకు పూర్తి భిన్న‌మైన నేప‌థ్యాన్ని ఎంచుకుని నితిన్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీని తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.  ట్రైల‌ర్ ఆద్యంతం నితిన్ ఎక్స్ ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ లో నితిన్ పూర్తిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డి న‌డ‌క న‌డ‌త మాట తీరు ప్రతిదీ టోన్ డౌన్ గా క‌నిపిస్తున్నాయి. డైలాగ్స్ లో ఫ‌న్, ఫ్యామిలీతో ఎపిసోడ్స్ లో నితిన్ ఎక్స్ ట్రార్డిన‌రీగా క‌నిపిస్తున్నాడు. కానీ అత‌డు కొన్ని యాక్ష‌న్ బ్లాక్స్ లో న‌టుడిగాను క‌నిపిస్తున్నాడు.  

ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ -రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి - నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 8 డిసెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
  

click me!