'జేమ్స్‌ బాండ్‌' సినిమా సెట్ లో పేలుడు..!

Published : Jun 05, 2019, 02:35 PM IST
'జేమ్స్‌ బాండ్‌' సినిమా సెట్ లో పేలుడు..!

సారాంశం

ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జేమ్స్ బాండ్'. ఈ సిరీస్ లో తెరకెక్కుతోన్న 25వ చిత్రమిది. 

ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జేమ్స్ బాండ్'. ఈ సిరీస్ లో తెరకెక్కుతోన్న 25వ చిత్రమిది. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఏదొక సమస్య వస్తూనే ఉంది.

మొదట డేనియల్ స్టంట్ సీన్లు చేస్తున్నప్పుడు కిందపడిపోయారు. దాంతో ఆయన కాలికి సర్జరీ చేయాల్సి వచ్చింది. దాని కారణంగా సినిమా షూటింగ్ వాయిదా వేయాల్సివచ్చింది. ఇప్పుడు సినిమా షూటింగ్ సెట్ లో పేలుడు సంభవించింది.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ లోని ప్రఖ్యాత పైన్ వుడ్ స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సెట్ లో స్టంట్ సన్నివేశాలు  తెరకెక్కిస్తుండగా మూడు సార్లు పేలుడు సంభవించింది.

దాంతో సెట్ పై కప్పు, గోడలు కూలిపోయాయి. ఈ ఘటనలో సెట్ బయట నిలబడిన ఓ వ్యక్తిని స్వల్ప గాయాలైనట్లు యూనిట్ వర్గాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే