హీరోయిన్ అమలా పాల్ కి ఘోర అవమానం... ఆలయ ప్రవేశం నిరాకరించిన పూజారులు!

Published : Jan 18, 2023, 09:38 AM ISTUpdated : Jan 18, 2023, 09:43 AM IST
హీరోయిన్ అమలా పాల్ కి ఘోర అవమానం... ఆలయ ప్రవేశం నిరాకరించిన పూజారులు!

సారాంశం

హీరోయిన్ అమలా పాల్ ఊహించని పరాభవం ఎదుర్కొన్నారు. ఎర్నాకులంలోని ఓ ఆలయ పూజారులు ఆమె గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో అమలా పాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.   

దేశంలోని కొన్ని హిందూ దేవాలయాలలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఇతర మతస్థులను అనుమతించని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పూజారులు, దేవాలయ కమిటీలు ఈ నియమాలు పకడ్బందీగా అమలు చేస్తాయి. ఈ క్రమంలో క్రిస్టియన్ అయిన అమలా పాల్ కి కేరళలోని ఓ దేవాలయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలా పాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారట. మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని అధికారులు ఆమెకు తెలియజేశారట. అంతగా కావాలంటే ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకొని వెన్నక్కి వెళ్లిపోవాలని సూచించారట.తిరువైరానికులం మహాదేవ ఆలయంలో తనకు జరిగిన పరాభవాన్ని అమలా పాల్ ఆలయ సందర్శన రిజిస్టర్ లో నమోదు చేసింది. 

నన్ను ఆలయంలోకి వెళ్లనీయక పోయినప్పటికీ అమ్మవారి ఆత్మను నేను అనుభవించాను. నేను మనసులో ఆమెను ప్రార్ధించాను. 2023లో కూడా ఇంకా మతపరమైన వివక్ష కొనసాగుతుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ వివక్ష ఎప్పటికైనా పూర్తిగా తొలగిపోవాలని ఆశిస్తున్నానని అమలా పాల్ వెల్లడించారు. అమలా పాల్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కొందరు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. లౌకిక రాజ్యం అని చెప్పుకుంటూ ఈ ఆంక్షలేంటి అంటున్నారు. 

అమలా పాల్(Amala Paul) గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకున్న ఆమె 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించారు. మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. 'ఆమె' మూవీలో నగ్నంగా నటించి అమలా పాల్ వార్తలకెక్కింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి