Esha Rebba Web Series : ఈషా రెబ్బా మరో వెబ్ సిరీస్ షురూ.. ఆల్ ద బెస్ట్ చెప్పిన డైరెక్టర్ హరీశ్ శంకర్..

Published : Mar 23, 2022, 06:45 PM IST
Esha Rebba Web Series : ఈషా రెబ్బా మరో వెబ్ సిరీస్ షురూ.. ఆల్ ద బెస్ట్ చెప్పిన డైరెక్టర్ హరీశ్ శంకర్..

సారాంశం

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) గతేడాదే వెబ్ సిరీస్ బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్  టీమ్ కు విషెస్ తెలిపారు.

పదేండ్ల కింద దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది ఈషా రెబ్బా. అప్పటి నుంచి తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. టాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న  హీరోయిన్లలో ఈషా రెబ్బా  కూడా ఒకరు. తన తొలి చిత్రం నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాల్లో కనిపిస్తున్నా సరైన హిట్ మాత్రం పడటం లేదు.  ప్రస్తుతం ఓటీటీల్లో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండటంతో అటువైపు ఫోకస్ పెట్టింది. గతేడాది ఆహా (Aha)లో రిలీజ్ అయిన ‘త్రి రోజెస్’ వెబ్ సిరీస్ లో నటించింది. రితూ అనే పాత్రను పోషించింది. 

ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం  ప్రకారం..  డైరెక్టర్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడవ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.  వేగేశ్న సతీష్ కథలు (మీవి మావి)' నుండి ఈ రోజు 'పడవ' మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్...  ఈయన 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే OTTలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. 

ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) 'పడవ' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్ కి అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బ జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. మోషన్ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. తాజాగా ఈ సిరీస్ నుండి మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథలు షూటింగ్ జరుపుకోనున్నాయి. త్వరలోనే వేగేశ్న సతీష్ 'కథలు' ఓ ప్రముఖ OTT సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ఈ వెబ్ సిరీస్ కు  సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.  కెమెరా మెన్ గా దాము, పాటలు :  శ్రీమణి,  ఎడిటర్ గా  మధు, ఆర్ట్ డైరెక్టర్ గా రామాంజనేయులు సహకరిస్తున్నారు. కాగా వెబ్ సిరీస్ కు రచన, దర్శకత్వం వేగేశ్న సతీష్ వహిస్తున్నారు. వేగేశ్న సతీష్, దుష్యంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌