దసరా కానుకగా NBK 107 టైటిల్ ప్రకటన...!

Published : Sep 27, 2022, 05:12 PM IST
దసరా కానుకగా NBK 107 టైటిల్ ప్రకటన...!

సారాంశం

బాలయ్య లేటెస్ట్ మూవీ నుండి దసరా కానుకగా అదిరిపోయే అప్డేట్ రానుంది. అక్టోబర్ 5న ఎన్బీకే 107 టైటిల్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతుంది.   

వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న బాలయ్య అఖండ మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం. ఇక సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే... అఖండ డబుల్ ప్రాఫిట్స్ పంచింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ జేబులు నింపింది. అఖండ మూవీ విజయంతో వచ్చిన ఊపులో బాలకృష్ణ తన 107వ చిత్రం ప్రారంభించారు. 

దర్శకుడు గోపీచంద్ మలినేని NBK 107 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అద్భుతంగా ఉంది. విడుదలైన ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. అయితే దసరా కానుకగా బాలయ్య-గోపీచంద్ మూవీ టైటిల్ ప్రకటన జరగనుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిస్తుంది. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు మాస్ టైటిల్ దర్శకుడు సిద్ధం చేసినట్లు సమాచారం. 

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి దసరా బరిలో మూవీ దించుతారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ మధ్యలో వాయిదా పడింది. దాంతో అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు. ఇక దసరాకు బాలయ్య నుండి సర్ప్రైజ్ ఉన్నట్లు సమాచారం అందుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య తదుపరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ