‘దేవర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, గుంటూరు కారం.. స్పెషల్ పోస్టర్లు చూశారా?

Published : Oct 23, 2023, 07:04 PM IST
‘దేవర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, గుంటూరు కారం.. స్పెషల్ పోస్టర్లు చూశారా?

సారాంశం

దసరా ఫెస్టివల్ సందర్భంగా.. దేవర, ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం లాంటి మోస్ట్ అవైటెడ్ చిత్రాల నుంచి అదిరిపోయే పోస్టర్లు విడుదలయ్యాయి. మాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   

టాలీవుడ్ లో భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. టాప్ టెక్నీషియన్లు, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండటంతో అప్ కమింగ్ చిత్రాలపై తారా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. విజయదశమి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan),  మహేశ్ బాబు (Mahesh Babu)   లేటెస్ట్ చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్లు విడుదలయ్యాయి. మాస్ లుక్స్ తో అభిమానులను ఖుషీ చేశారు. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబో మూడోసారి సెట్ అవ్వడంతో  సినిమాపై అభిమానులతో పాటు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా విజయదశమి సందర్భంగా మరో మాస్ పోస్టర్ ను విడుదల చేశారు. మహేశ్ బాబు ఊరమాస్ లుక్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పోస్టర్ విడుదల చేస్తూ ఫస్ట్ సింగిల్ పైనా అప్డేట్ అందించారు. త్వరలో మొదటిపాట విడుదల చేస్తామని చెప్పారు.

‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh).  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఖాకీ లుక్ దుస్తుల్లో మాస్ అవతార్ తో దర్శనమిచ్చారు. విజయ్ దశమి సందర్బంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ (Devara). యూనిట్ షూటింగ్ బిజీలో ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్లు, బర్త్ డే పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేశారు. తాజాగా విజయదశమి సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్  పోస్టర్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ పిడికిలో ఉన్న ఆయుధాన్ని చూపిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా