సుమ సగం యాంకరింగ్.. కారణమదేనా..?

Published : May 02, 2019, 04:48 PM IST
సుమ సగం యాంకరింగ్.. కారణమదేనా..?

సారాంశం

గల గల మాటలు, ఆ మాటల వల్ల వచ్చే నవ్వులు.. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోన్న సుమని టీవీ షోలు చూసేవారే కాదు.. 

గల గల మాటలు, ఆ మాటల వల్ల వచ్చే నవ్వులు.. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోన్న సుమని టీవీ షోలు చూసేవారే కాదు.. కాలేజ్ కి వెళ్లే యూత్ కూడా ఇష్టపడతారు. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ కార్యక్రమాలకి కూడా 
వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఒక సినిమా ఈవెంట్ చేయడానికి దాదాపు మూడు లక్షల పారితోషికం తీసుకుంటుంది. కాబట్టి షో మొత్తం తనే హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. కానీ నిన్న జరిగిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాత్రం సుమ సగం యాంకరింగ్ మాత్రమే చేసింది. ట్రైలర్ రిలీజ్ వరకు స్టేజ్ పై ఉన్న సుమ ఆ తరువాత కనిపించలేదు. 

మిగిలిన కార్యక్రమాన్ని మరో యాంకర్ గీతాభగత్ పూర్తి చేసింది. ఈ మధ్య కాలంలో ఒక షోని ఇద్దరు యాంకర్లు కలిపి హోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి స్టేజ్ పై ముగ్గురు యాంకర్లు కూడా కనిపిస్తారు. రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా షోని హైలైట్ చేయడానికి ఒకరికి ఇద్దరిని తీసుకొస్తున్నారు నిర్వాహకులు.

ఈ క్రమంలో 'మహర్షి' ఈవెంట్ లో కూడా ఇద్దరు యాంకర్లు ఉండాలని భావించిన నిర్వాహకులు.. సుమతో పాటు మరో యంగ్ యాంకర్ కి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. ఆ కారణంగానే సుమ కొంతవరకే 'మహర్షి' ప్రీరిలీజ్ ఈవెంట్ ని హోస్ట్ చేసింది. అయితే తన రెమ్యునరేషన్మాత్రం ఎప్పటిలానే తీసుకుందట. ఫుల్ రెమ్యునరేషన్, పని మాత్రం సగమే ఇంకేం కావాలి చెప్పండి!

PREV
click me!

Recommended Stories

Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?